Yoga Mahotsav: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా యోగా మహోత్సవ్.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జూన్ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. మార్చి 13 నుంచి 100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. చివరి 25 రోజుల కౌంట్‌డౌన్‌కి సూచికగా హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
జూన్ 21.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. మార్చి 13 నుంచి 100 రోజులపాటు దేశవ్యాప్తంగా యోగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. చివరి 25 రోజుల కౌంట్‌డౌన్‌కి సూచికగా హైదరాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 100 రోజుల కౌంట్‌డౌన్ ఈవెంట్ న్యూఢిల్లీలో, 75 రోజుల మహోత్సవం అసోమ్‌లోని దిబ్రూఘర్‌లో, 50వ రోజు కౌంట్‌డౌన్ జైపూర్‌లో షురూ ఐంది. ఇప్పుడు 25వ రోజు కౌంట్‌డౌన్‌కి సంకేతంగా హైదరాబాద్‌లో యోగా మహోత్సవ్ జరుగుతోంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో శనివారం ఉదయం 6 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా అభ్యాసకులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు.. కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖమంత్రి సర్బానంద సోనోవాల్, కేంద్ర ఆయుష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా.ముంజపరా మహేంద్రభాయ్ కాళూభాయ్ పాల్గొన్నారు. పలువురు సినీ ప్రముఖులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 108 యోగా సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
యోగా వేడుకల్లో భాగంగా మొదటిసారి, వివిధ సాంస్కృతిక బృందాలకు చెందిన 1,000 మంది కళాకారులు పలు ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విజయవంతం అయ్యేలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం