AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు.. వారం రోజుల్లో ట్రయల్స్..

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు.. వారం రోజుల్లో ట్రయల్స్..
Shiva Prajapati
|

Updated on: Feb 02, 2022 | 8:15 PM

Share

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ జంక్షన్లలో భారీ మార్పులు చేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించడం జరుగుతుందన్నారు. భాగ్యనగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో.. నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా సిగ్నల్ ఫ్రీ సిటీగా చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టే యోచన చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, లంగర్‌హౌజ్, నానల్ నగర్, రవీంద్రభారతి, కంట్రోల్‌ రూమ్‌తో పాటు పలు జంక్షన్లలో మార్పులు చేయనున్నట్లు రంగనాథ్ తెలిపారు.

మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వాహనాలన్నింటినీ నేరుగా.. పంజాగుట్టకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఫిల్మ్‌నగర్ నుంచి రోడ్డు నెంబర్ 10 వైపు వెళ్లే వాహనాలన్నింటినీ.. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి ఫ్రీ లెప్ట్ ఇచ్చి మళ్లించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సక్సెస్ అయింది ఫ్రీలెప్ట్ విధానం. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జంక్షన్ల మాదిరిగానే అన్నింటినీ తయారు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు రంగనాథ్. వాహనాలు జంక్షన్ల వద్ద నిలిచిపోకుండా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నట్లు గుర్తించామని, రద్దీగా ఉండే జంక్షన్ల మార్పులపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వారం రోజుల్లో రద్దీ జంక్షన్ల వద్ద ట్రయల్స్ నిర్వహిస్తామని చెప్పారు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.

Also read:

Viral Video: దొంగలకు రివర్స్ ఝలక్ ఇచ్చిన షాపు యజమాని.. మరి ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి..!

Kisanreddy on KCR: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్!

Bhaskar Naidu: స్నేక్ క్యాచర్ భాస్కర్ పరిస్థితి విషయం.. తగ్గుతున్నప్లేట్ లెట్స్ వెంటిలేటర్‌పై చికిత్స..