Bhaskar Naidu: స్నేక్ క్యాచర్ భాస్కర్ పరిస్థితి విషయం.. తగ్గుతున్నప్లేట్ లెట్స్ వెంటిలేటర్‌పై చికిత్స..
TTD Snake Catcher Bhaskar Naidu: కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.. ఈ దారుణ ఘటన తిరుపతి(Tirupati)లో...
TTD Snake Catcher Bhaskar Naidu: కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.. ఈ దారుణ ఘటన తిరుపతి(Tirupati)లో చోటు చేసుకుంది. ఆరు రోజుల క్రితం ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ (TTD Snake Catcher) భాస్కర్ నాయుడు(Bhaskar Naidu) పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాము కాటు .. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో వైద్యులు భాస్కర్ నాయుడికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు.
ప్రస్తుతం వెంటిలేటర్‌పై భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్నారు. అయితే భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల బారి నుంచి శ్రీవారి భక్తులను భాస్కర్ నాయుడు రక్షిస్తున్నారు. టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూ ఇప్పటి వరకు 10వేల పాములకు పైగా పట్టుకుని వాటిని సురక్షితంగా అడవుల్లో తిరిగి విడిచి పెట్టేవారు. అయితే ఇప్పటికే టీటీడీ ఉద్యోగిగా రిటైరైనప్పటికీ టీటీడీ అధికారులు భాస్కర్ నాయుడు సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన ఆసుపత్రి పాలవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ప్రాణాపాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.