Statue of Equality: అంకురార్పణ ఘట్టంతో మొదలైన సమతామూర్తి సమారోహ క్రతువు.. భవ భక్తి సాగరంగా మారిన ముచ్చింతల్!
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతకార్యక్రమం సమతామూర్తి సమారోహం. ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే అధ్యాయం ఆరంభం.
Sri Ramanuja millennium celebrations 1st day: శ్రీమతే రామానుజాయ నమః ! ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే అధ్యాయం ఆరంభం. మన రామానుజ సహస్రాబ్ధి సమారంభం(Sri Ramanuja millennium celebrations). ఫిబ్రవరి 2 తేదీన ఆరంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనుంది. 12 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహం విశేషాలను తెలుసుకుని శ్రీరామానుజు అనుగ్రహాన్ని పొందుదాం.. మహోజ్వలంగా ఆరంభమైంది. అల వైకుంఠపురం మన ముచ్చింతల్(Muchinthal)లో ఇల వైకుంఠపురంగా సాక్షాత్కారమైంది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి(Sri Chinna Jeeyar Swamy) సత్ సంకల్పం సాకారమైంది. సమతా స్పూర్తి జ్ఞాన చైతన్య పరిమళాలు విశ్వ ఆధ్మాత్మికనగరిలోనే విశ్వమంతా గుభాళిస్తున్నాయిప్పుడు. ఎప్పడెప్పుడా అని భక్తి కోటి ఆర్తిగా ఎదురుచూసిన శుభసందర్భం సుమనోహారం.. ప్రసన్నంగా ప్రత్యక్షమైంది. మన రామానుజ వెయ్యేళ్ల వేడుకకు అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్ధం తలపెట్టిన సహస్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ మహాయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు రుత్వికులు.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతకార్యక్రమం సమతామూర్తి సమారోహం. ఇందలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమానికి పూర్వరంగంగా వాస్తుపురుషుడి పూజ జరిపించడానికి ఫిబ్రవరి 2 తేదిన శ్రీరామచంద్ర పెరుమాళ్ అశ్వవాహన రూరుడై వైభవోపేతంగా ఊరేగింపుగా శోభాయాత్రతో యజ్ఞస్ధలికి విచ్చేశాడు. స్ధల దోషనివారణకు వాస్తు పురుషుని చిత్రపటాన్ని పిండితో చిత్రీకరించి వాస్తుపూజ నిర్వహించారు. అనంతరం మహక్రతువులలో ఎలాంటి ఆటంకాలు కలగకుండ, వాస్తు యజ్ఞం, పూర్ణహూతి క్రతువులు జరిగాయి. ఆ తరువాత పుణ్యహ వచనం, హోమసామాగ్రి శుద్ది. రుత్విక్ వరణ, యజ్ఞం నిర్వహించే రుత్వికులకు మరియు యుజ్ఞ హోతలకు దీక్షావస్త్రాలు సమర్పించారు. తెలుగు సంస్కృతిని ప్రతిభింబించే సాంస్కృతిక కళాకారుల తో సమతాక్షేత్రం సాంస్కృతిక శోభను సంతరించుకుంది.
ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ముచ్చింతల్ సమతా క్షేత్రంలో విరాట్ రూపంలో భగవత్ రామానుజుల ఆవిష్కరణ జరగనుంది. ఈ సందర్భంగా మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువుకు అంకురార్పణ జరబోయేముందు విష్ణుసహస్రనామ పారాయణ జరిగింది. ఈ పారాయణతో సూర్తి కేంద్రమంతా నారాయణ నామస్మరణతో మారుమ్రోగింది. శ్రీ లక్ష్మీనారాయణ మహా యజ్ఞానికి అంకురార్పణలో భాగంగా ముందుగా విష్వక్సేన ఆరాధన, తర్వాత పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్ సంగ్రహణం అంటే మట్టిని సేకరించడం లాంటి అంకురార్పణ ఘట్టాలు జరిగాయి. అనంతరం సోమహోమం అంటే అంకురార్పణ దేవతలను ఆహ్వానించి హోమం చేస్తారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. పాలికలు అనే మట్టి మూకుళ్లలో మట్టిని నింపి అందులో నవధాన్యాలను నాటుతారు. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా బ్రహ్మండంగా జరుగుతాయి.
ఫిబ్రవరి 2వ తేదిన అంకురార్పణతో మొదలైన మహాక్రతువు.. తెల్లవారు జామున అరణిమథనంతో మొదలవుతుంది. ముందుగా అగ్నిని అగ్గి పెట్టతోనో,కర్పరంతోనో కాకుండ రెండు కర్రలమధ్య అరణిమదనం చేస్తారు. క్రింద శమీవృక్ష కర్ర పై అశ్వద్ద వృక్ష కర్రని పెట్టి అగ్నిమదనం చేస్తారు. శమీవృక్షం స్త్రీ రూపంగా, పైన ఉండే అశ్వద్ధ వృక్షాన్ని పురుషరూపంగా భావిస్తారు. లక్ష్మీనారాయణ స్వరూపంగా వారిద్దిరి చెలిమి,వారిద్దరి తోడ్పాటు అగ్ని ఆవిర్భావానికి కారణమవుతుంది. ఆ అగ్నిప్రతిష్ఠాపనతో శ్రీలక్ష్మీనారాయణ క్రతువు 1035 హోమకుండాలతో ప్రారంభమవుతుంది. ముందుగా పశ్చిమవైపుఉన్న యాగ కుండాలతో మొదలు పెట్టి అక్కడి నుంచి 1035 కుండాలకు అగ్నిని ఆందించి 12 రోజుల పాటు ఆ అగ్నినే ఆరాధిస్తారు. మొదటి రోజు దుష్టనివారణకోసం శ్రీసుదర్శనేష్టి. సర్వాభీష్టసిద్ధికోసం శ్రీవాసుదేవేష్టితో పాటు శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్దజీయర్ స్వామివారి అష్టోత్తరశతనామపూజ జరుగుతుంది.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యం వుంటుంది నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు భగవంతుడి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఉద్దేశం.‘సస్యకారక చల్లని చంద్రుడి వెన్నల నీడలో ఈ ఘట్టం మహాద్బుతంగా జరిగింది. మట్టి పాత్రాల్లో 9 రకాల ధాన్యాలను నాటారు. విత్తనాలు ఎంతలా మొలకత్తితే.. మహాయజ్ఞం అంతా వైభవోవేపేతం అవుతుంది. ఇక రేపటి మహాయజ్ఝం కోసం యజ్ఞాగ్ని మదనం శాస్త్రోక్రంగా ..దిగ్విజయంగా జరిగాయి.
మాతో రామా..మత్ పితో రామా…రామ నామస్మరణాలతో ఆధ్మాత్మిక నగరి మార్మోగింది.నయన మనోహరంగా సాగిన సీతా పిరాట్టి సమేత కోదండరాముడి శోభాయాత్ర లో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అశ్వవాహనాన్ని అధిరోహించిన జగదైక చక్రవర్తి శ్రీరామచంద్రుడు దివ్య సాకేతం నుంచి భవ్యయాగ శాలకు వేంచేశారు. ఆ దృశ్యం చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు అన్నంతగా మైమమరిచారు భక్తులు. కలయా:..నిజమా..! కళ్లెదుట వైష్ణవ మహాత్యం. ఇలలోన అలవైకుంఠపురం. విశ్వ ఆధ్మాత్మిక నగరి ముచ్చింతల్‌లో సర్వం శోభాయమానం. రామానుజ దివ్యాజ్ఞ.. భగవదానుగ్రహం.. శ్రీశ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అకుంఠిత తపస్సు.. వెరసి చరిత్రాత్మకమైన మహోజ్వల ఘట్టం మన తరంలో..మన కళ్లెదుట జరగం ఎంత మహాద్బాగ్యం. ముచ్చింతల్ భక్త జనసంద్రమైంది.పుష్కర జాతరను తలపిస్తోంది.
ఓం నమో నారాయణాయ: వందే గురుపరంపరామ్.. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది. విశ్వ నలుగుచెరుగుల నుంచి వచ్చిన రుత్వికులు , భగవత్ బంధువులతో ముచ్చింతల్ భవ భక్తి సాగారంగా మారింది. భగవత్ తత్వం..గురుపరంపర ప్రాశాస్త్యానికి అద్దంపట్టింది. భారత్ నలుగుచెరుగుల నుంచే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా సహా మరెన్నో విదేశాల నుంచి భగవత్ బంధువులు విచ్చేశారు. మంచికాలానికి మహాద్వారాలను తెరుస్తూ రామానుజ అనుగ్రహ భాష్య ప్రవచనాలతో మంగళాశాసనాలందించారు.