Chanakya Niti: రోజూ ఈ 5 విషయాలను గుర్తు పెట్టుకుంటే.. సమస్యల నుంచి బయటపడతాడంటున్న చాణక్య..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. చాణుక్యుడు తన జీవితానుభవంతో చెప్పిన విషయాలను ప్రస్తుత..

Chanakya Niti: రోజూ ఈ 5 విషయాలను గుర్తు పెట్టుకుంటే.. సమస్యల నుంచి బయటపడతాడంటున్న చాణక్య..
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Feb 02, 2022 | 9:27 PM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం( Niti-Shastra)లో మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. చాణుక్యుడు తన జీవితానుభవంతో చెప్పిన విషయాలను ప్రస్తుత సమాజంలో నేటి జనరేషన్ కు అనుసరణీయం. అలా చాణుక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే.. ఎంతటి కష్టమైనా తేలికగా నివారించుకోవచ్చు. ఈ రోజు జీవితంలో మనిషిని అన్ని సమస్యల నుండి  రక్షించగల ఐదు విషయాలు గురించి తెలుసుకుందాం..

*సింహం తన సహజ స్వభావమైన హింసను ఎప్పటికీ విడిచిపెట్టనట్లే.. దుర్మార్గుడు కూడా తన దుష్టత్వాన్ని ఎప్పటికీ వదులుకోలేడు. అందుకనే చెడు వ్యక్తి  చెప్పే తియ్యని మాటలకు లొంగి ఎప్పుడూ తప్పు చేయవద్దు.

* అబద్ధం చెప్పే వ్యక్తి ఏదో ఒకరోజు కష్టాల్లో కూరుకుపోతాడు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని దాచడానికి.. అతను మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏదొక రోజు ఆ అబద్ధం బయటపడి సిగ్గుపడే సందర్భం వస్తుంది. అప్పుడు అతను విశ్వసనీయతను కూడా కోల్పోతాడు. కనుక ఎంత కష్టం వచ్చినా అబద్ధం చెప్పకండి.

*ఎవరైతే చెప్పేమాటలు.. చేసే పనులు ఒక దానికొకటి సంబంధం లేకుండా విరుద్ధంగా ఉంటాయో.. అలాంటి వ్యక్తులు  ఎప్పుడూ నమ్మదగినవారు కాదు. తన ఆలోచనలను కార్యరూపంలో పెట్టి.. ఇతరులకు విద్యను అందించే వ్యక్తి ఎల్లప్పుడూ నమ్మదగిన వ్యక్తిగా గుర్తుంచుకోండి.

*చదువు లేని చోట,  ఉపాధి మార్గం లేని ప్రదేశాలకు బుద్ధిమంతుడు ఎప్పుడూ వెళ్ళడు.

* నడుస్తున్న సమయంలో పాదాల కింద ఉన్న ప్రదేశాలు చూడాల్సి ఉంటుంది. అలా చూడకుండా నడిచే వారు  ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులు తమకి తాముగా ఇబ్బందులను ఆహ్వానిస్తారు.

Also Read: చిన్నమ్మతో రాములమ్మ భేటీ.. తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!