Kishan Reddy on KCR: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్!
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి ఇలా రాజ్యంగా వ్యవస్థలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు.
Kishan Reddy Fire on KCR: కేంద్ర బడ్జెట్( Union Budget)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయి ఇలా రాజ్యంగా వ్యవస్థలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు సీఎం కేసీఆర్ రెండున్నర గంటలు ఏకాపాత్రాభినయం చేశారని దుయ్యబట్టారు.ప్రజలను ఆకట్టుకుని మాట్లాడినంతమాత్రాన అబద్దాలు నిజాలు కావాని స్పష్టం చేశారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేరకు అమలు పరిచారో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్.. అంబేద్కర్ అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు కిషన్ రెడ్డి. కనీసం సెక్రటరీయట్ కూడా వెళ్లని సీఎం.. దేశంలో గుణాత్మకమైన మార్పు తీసుకువస్తారని చెప్పడం హస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ పట్ల శత్రుదేశం పాకిస్తాన్ కూడా మాట్లాడని విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడడం చాలా బాధకరంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ధర్నా చౌక్ ఎత్తివేసిన సీఎం రైతుల ఉద్యమం గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. సంవత్సర కాలం పాటు రైతులు ఉద్యమం చేసినా వారికి అన్ని సౌకర్యాలు కల్పించామని కాని సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను సైతం జైల్లో పెట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌దని దుయ్యబట్టారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం యూరియాపై ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. కేంద్రం యూరియా కోసం లక్ష కోట్ల రూపాయలు కేటాయింపులు చేసిందన్నారు. ఈ సబ్సీడి గత సంవత్సరం కంటే 33 శాతం ఎక్కువని అన్నారు.