- Telugu News Photo Gallery Political photos Bjp congress fires on kcr over constitution must be rewritten to bring change in India
తెలంగాణలో కొత్త రాజ్యాంగం రగడ.. కొత్త రాజ్యాంగం కావాలన్న సీఎం.. అంబేద్కర్‌ను అవమానించారని బీజేపీ, కాంగ్రెస్ ఫైర్
దేశానికో కొత్త రాజ్యాంగం కావాలి.. ఈ ఒక్క మాట... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట.. దేశరాజకీయాల్లో కొత్త చర్చకు నాంది వేశారు సీఎం కేసీఆర్.
Updated on: Feb 02, 2022 | 7:37 PM

దేశానికో కొత్త రాజ్యాంగం కావాలి.. ఈ ఒక్క మాట... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట.. దేశరాజకీయాల్లో కొత్త చర్చకు నాంది వేశారు సీఎం కేసీఆర్. ఇదే మాట ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ మేటర్‌లో.. భారతీయ జనతా పార్టీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

భారత రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకోవాల్సిన అవసరం ఉందంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడింది బీజేపీ. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న కేసీఆర్.. అంబేద్కర్ అవమానించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. అలాంటి అంబేద్కర్‌ను అవహేళన చేసేలా కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

కేసీఆర్ వ్యాఖ్యల్ని వక్రీకరించి.. కాంగ్రెస్, బీజేపీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు టీఆర్‌ఎస్ నేతలు. ఏడు దశాబ్దాలుగా రాజ్యంగాన్ని అపహాస్యం చేసి దళితులను అణగదొక్కిన పార్టీలు .. ఇప్పుడు అంబేద్కర్‌పై లేని గౌరవాన్ని నటిస్తున్నాయని మండిపడింది. మరోవైపు, కేసీఆర్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. రేపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆఫీసుల్లో దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది బీజేపీ. దీంతో, తెలంగాణలో పొలిటికల్ మంటలు రాజేసిన కొత్త రాజ్యాంగం రగడ.. ఏ మలుపు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.
