Hyderabad: చంద్రయాణాగుట్టలో కంత్రి దొంగలు.. మద్యం దుకాణంలో చోరీ.. ఎలా చొరబడ్డారంటే..

హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో కంత్రీ దొంగలు రెచ్చిపోయారు. మద్యం దుకాణంలోకి చొరబడ్డారు. పైకప్పులోని జింక్ రేకులు కత్తిరించి షాపులోకి ఎంటరైన దొంగలు..

Hyderabad: చంద్రయాణాగుట్టలో కంత్రి దొంగలు.. మద్యం దుకాణంలో చోరీ.. ఎలా చొరబడ్డారంటే..
Wine Shop Robbery
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 12, 2022 | 2:05 PM

హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో కంత్రీ దొంగలు రెచ్చిపోయారు. మద్యం దుకాణంలోకి చొరబడ్డారు. పైకప్పులోని జింక్ రేకులు కత్తిరించి షాపులోకి ఎంటరైన దొంగలు.. నగదు, మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకం సృష్టించింది. ఈ చోరీకి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాంద్రాయణగుట్ట గాంధీవిగ్రహం లేన్‌లో ఉన్న విజయ్ వైన్స్‌లో దొంగలు పడ్డారు. వైన్ షాపు నిర్వాహకులు ఉదయం వైన్ షాపును ఓపెన్ చేయగా పైకప్పు రేకులు కత్తిరించి కనిపించాయి. వెంటనే అలర్ట్ అయిన షాపు నిర్వాహకుడు కిరణ్ నగదు పెట్టె, మద్యం బాటిళ్లను పరిశీలించాడు. రూ. 40 వేలు, కొన్ని మద్యం సీసాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చోరీ జరిగిన వైన్ షాపు వద్దకు వచ్చిన పోలీసులు.. దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు రెక్కీ నిర్వహించి మరీ చోరీ చేసినట్లు నిర్ధారించుకున్నారు. అంతేకాదు.. దొంగలు చోరీ చేసే ముందు రూటర్ ఇంటర్నెట్ కట్ చేసి డీవీఆర్, మద్యం సీసాలు పట్టుకెళ్లినట్లు గుర్తించారు. దొంగలు వైన్‌షాపులో తేరగా కూర్చొని ఫుల్లుగా మద్యం సేవించి, అనంతరం నగదు పెట్టెలో ఉన్న రూ. 40 వేలు తీసుకెళ్లినట్లు నిర్ధారించారు పోలీసులు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పరిసరాల్లోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..