AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode By-Poll: తెలంగాణ సీఏం కేసీఆర్ పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. పిచ్చి వేషాలు వెయ్యొద్దంటూ ఆ నేతలకు వార్నింగ్..

ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఓ ఎమ్మెల్సీ తన భార్య ఈటల జమునకు ఇక్కడేం పని, ఆమె ఎందుకు వచ్చింది అన్నారంట.. జమున పుట్టిన గడ్డ ఇది, ఈ మట్టి బిడ్డ ఆమె సొంత ఊరికి..

Munugode By-Poll: తెలంగాణ సీఏం కేసీఆర్ పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. పిచ్చి వేషాలు వెయ్యొద్దంటూ ఆ నేతలకు వార్నింగ్..
Etela Rajender In Munugode (File Photo)
Amarnadh Daneti
|

Updated on: Oct 12, 2022 | 1:45 PM

Share

తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది. ముఖ్యంగా టీఆర్ ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇరు పార్టీల నాయకులు సవాలు, ప్రతి సవాలు విసురుకుంటున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శలు చేస్తుంటే కమలం పార్టీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల రాజేందర్ సీఏం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో టీఆర్ ఎస్ పార్టీ నేతలకు పిచ్చి వేషాలు వెయ్యొద్దని, స్థాయిని బట్టి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ప్రచారానికి వచ్చిన ఓ ఎమ్మెల్సీ తన భార్య ఈటల జమునకు ఇక్కడేం పని, ఆమె ఎందుకు వచ్చింది అన్నారంట.. జమున పుట్టిన గడ్డ ఇది, ఈ మట్టి బిడ్డ ఆమె సొంత ఊరికి రావొద్దట. ఎక్కడో ఉన్న వారు ఇక్కడికి వచ్చి ఉంటారు.. అనవసర మాటలు మాట్లాడవద్దు జాగ్రత్త మా జోలికి వస్తే మాడి మసి అవుతారంటూ ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ నేతలను హెచ్చరించారు. మోడీ గీడి ఎవరు ఏం పీకలేరు అని మరొకరు మాట్లాడుతున్నారు. స్థాయిని బట్టి మాట్లాడాలి . ఎది పడితే అది మాట్లాడితే కుదరదు. మీ మాటలు అన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

కళ్యాణలక్ష్మీ, పెన్షన్, రైతుబంధు పథకాలకు 22 వేలకోట్లు,  సంక్షేమ హాస్టళ్లు వంటి వాటికి 25 వేల కోట్ల రూపాయలు సీఏం కెసిఆర్  ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రతి వందమందికి ఒక బెల్ట్ షాప్ పెట్టి తాగిపించి 45 వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు, ప్రజలను చంపి సంపాదిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రైతుబందు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్న సీఎంకు కౌలు రైతులకు ఇవ్వడానికి మనసురావడం లేదన్నారు. దళితబంధు ఐఏఎస్ ఆఫీసర్స్ కి ఇస్తావా, పేదలకు ఇవ్వు తప్ప అధికారులకు కాదని హితవు పలికారు. గిరిజనబంధు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 33 తండాల గిరిజన ఓట్ల కోసం వచ్చింది తప్ప వాళ్ళ మీద  ప్రేమ కోసం కాదన్నారు. తన భార్య జమున  కెసిఆర్ నువ్వు నమ్మక ద్రోహివి అని బహిరంగంగా చెప్పిందని, ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు నా ఆస్తులు తెగనమ్ముత కెసిఆర్ మీద కొట్లాట మాత్రం అపవద్దు అని భరోసా ఇచ్చిందని ఈటల రాజేందర్ తెలిపారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ఓటు వేయమని అడిగిందని, అలాగే జమున ఈ నియోజక వర్గం మట్టి బిడ్డ అని, రాజగోపాల్ రెడ్డి కష్టం చూసి ఆమె అమ్మ గారి ఊరు పలివెలకు వచ్చి ధర్మాన్ని కాపాడమని కోరిందన్నారు రాజేందర్.  స్వేచ్చగా అన్ని పార్టీలు ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్, పోలీసులను కోరుతున్నానని, లేకపోతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కెసిఆర్ శాశ్వతంగా పాలించడానికి రాలేదని, 2023 వరకే ఆయన ఉంటారని, అధికారులు ఆయన బానిసలు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కెసిఆర్ బానిసల్లాగ పని చేసే అధికారులు, పోలీసులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మీ భరతం పట్టడం ఖాయమంటూ హెచ్చరించారు. ఎవరి జోలికి పోకుండా తాము ప్రచారం చేసుకుంటున్నామని, తమ జోలికి రావద్దని ఈటల రాజేందర్ సూచించారు. మీకు ధర్మం, న్యాయం లేదు డబ్బును మద్యాన్ని నమ్ముకున్నారు, పిచ్చి వేషాలు వేస్తే హుజూరాబాద్ లో జరిగిందే ఇక్కడ కూడా జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లనే మునుగోడు ప్రజలకు డబ్బులు వస్తున్నాయి. మీ ముంగిటికి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఆయన వల్లే ఇవి వస్తున్నాయి కాబట్టి ఆయన్ని మర్చిపోవద్దు అని మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈటల రాజేందర్. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగిన ఈటల రాజేందర్ టీఆర్ ఎస్ ప్రభుత్వం, నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..