Munugode Bypoll: డోస్ పెంచిన మంత్రి కేటీఆర్.. ఏకంగా ప్రధాని టార్గెట్‌గా సంచలన ట్వీట్..
నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్‌లని పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపిన మంత్రి కేటీఆర్.. బుధవారం నాడు ఇంకాస్త డోస్ పెంచారు. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ..
నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్‌లని పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపిన మంత్రి కేటీఆర్.. బుధవారం నాడు ఇంకాస్త డోస్ పెంచారు. ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే బదులు జిల్లాకు నిధులిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొనసాగిస్తూ.. అటాక్స్ కంటిన్యూ చేస్తున్నారు.
‘ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు. రాజకీయ ప్రయోజనం కాదు.. నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు. గుజరాత్‌కు గత ఐదు నెలల్లో రూ. 80 వేల కోట్ల ప్యాకేజీలిచ్చారు. మా తెలంగాణకు కనీసం రూ. 18,000 కోట్లు ఇవ్వలేరా? నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి రూ. 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ రూ. 18,000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ గారు నల్గొండ జిల్లాకు రూ. 18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా?’ అంటూ కౌంటర్ అటాక్స్ కంటిన్యూ చేశారు మంత్రి కేటీఆర్.
కాగా, కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్ట్‌లంటూ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై మంత్రులు సహా ఎమ్మెల్యేలు సైతం హాట్ హాట్ కామెంట్స్‌తో ముప్పేట దాడి చేస్తున్నారు. కోవర్టులు, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నికలు అని మంత్రులు విమర్శిస్తుంటే.. ఎమ్మెల్యేలు ఇంకాస్త ముందుకెళ్లారు. తీవ్రమైన కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ బ్రోకర్లని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం కోవర్ట్ రాజకీయాలు చేస్తున్నారని, వారి ప్రయోజనాల కోసమే ఉపఎన్నిక తీసుకువచ్చరి దుయ్యబట్టారు. ఇలా నేతల మాటల యుద్ధంతో మునుగోడు రాజకీయం మరింత రంజుగా మారింది.
నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలణ కోసం మిషన్ భగీరథకి 19,000 కోట్లు కేటాయించమని సిఫార్సు చేస్తే పెడచెవిన పెట్టారు
రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ 18,000 Cr కాంట్రాక్టు
ఇప్పటికైనా మోడీ గారు నల్గొండ జిల్లాకు ₹18,000 కోట్ల ప్యాకేజి ప్రకటిస్తే పోటీనుండి తప్పుకుంటాం. బీజేపీ సిద్ధమా? pic.twitter.com/aWyb5ypDD6
— KTR (@KTRTRS) October 12, 2022
ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యం
దశాబ్దాలు అధికారంలో ఉన్నా స్వయంగా ప్రధానికి మొరపెట్టుకున్నా పైసా ఇవ్వలేదు, పరిష్కారం కాలేదు
తెరాస ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన శాశ్వతంగా ఈ సమస్య తీర్చిన మాట వాస్తవమని కేంద్రమే పార్లమెంట్లో చెప్పింది pic.twitter.com/8rLMEcaM44
— KTR (@KTRTRS) October 3, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..