AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు అభిమానుల భరోసా.. ఇంటికి వచ్చిన అందరి దృష్టి దానిపైనే..!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటి నుంచి బయటకు వెళ్తున్న అభిమానులకు ఓ మొక్క ఆకర్షణగా కనిపించింది. ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్లి ఆ మొక్కను చూసి వెళ్లడం.. కొంతమంది ఆ మొక్కకు ఉన్న రెండు ఆకులను ఫోటోలు తీసుకోవడం కనిపించింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు అభిమానుల భరోసా.. ఇంటికి వచ్చిన అందరి దృష్టి దానిపైనే..!
Paint Plant In Kavitha House
Rakesh Reddy Ch
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 29, 2024 | 5:59 PM

Share

జైలు నుంచి విడుదలై, ఇంటికి చేరుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను కలవడానికి వేలాదిమంది కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. బుధవారం(ఆగస్ట్ 28) శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమె వెంట వచ్చిన వందలాది కార్ల కాన్వాయ్ తో వచ్చిన జనంతో ఇల్లు మొత్తం కిక్కిరిసిపోయింది. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత ఇంటికి వచ్చారు కవిత. ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేమ్‌లో అందంగా ఆనందంగా ఒదిగిపోయారు. ఒక్కొక్కరుగా కవితను కలిసి… మేమున్నామంటూ ధైర్యం చెప్పి, ఓ ఫోటో దిగి వెళ్ళిపోయారు అభిమానులు.

ఇంటి నుంచి బయటకు వెళ్తున్న అభిమానులకు ఓ మొక్క ఆకర్షణగా కనిపించింది. ఒక్కొక్కరుగా అక్కడికి వెళ్లి ఆ మొక్కను చూసి వెళ్లడం.. కొంతమంది ఆ మొక్కకు ఉన్న రెండు ఆకులను ఫోటోలు తీసుకోవడం కనిపించింది. ఇంతకీ ఆ చిన్న చెట్టులో అంత స్పెషాలిటీ ఏముందని జాగ్రత్తగా పరిశీలిస్తే.. నిజంగానే అందులో స్పెషల్ ఉంది.

కవిత గత ఐదు నెలలకు పైగా జైల్లో గడిపింది. ఆమె జైలుకు వెళ్లక ముందు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఒక అభిమాని ఓ చిన్న మొక్కను ఆమెకు బహుకరించారు. ఆ చిన్న మొక్కకున్న చిన్ని ఆకులపై కవిత ఫోటోను, జై కేసీఆర్- జై కవితక్క అంటూ రాశారు. ఒక ఆకుపై కవిత ఫోటోను రంగులతో నింపగా.. మరో ఆకుపై జై కేసీఆర్.. జై కవితక్క అంటూ రాశారు. అయితే అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఎన్ని నెలలైనా ఆకులపై వేసిన పెయింటింగ్ చెరిగిపోలేదు. అంతేకాదు ఆ చిన్న ఆకులు ఒక అరచేతి మందం పెరిగిన అందులో పెయింటింగ్ కూడా అలాగే పెరుగుతూ వచ్చింది.

సాధారంగా ఆకులు పెరిగితే దానిమీద ఉన్న పెయింటింగ్ లేదా గీతలు చెరిగిపోవడం, అడ్డదిడ్డంగా మారడం జరుగుతాయి. కానీ ఇన్ని నెలల తర్వాత కూడా ఆకులపై ఉన్న పెయింటింగ్స్ అలాగే ఉన్నాయి. ఆకులతో పాటు సైజు కూడా పెరిగింది. అయినా మార్పు కనిపించలేదు. అయితే కవితను కలవడానికి వచ్చిన వేలాదిమంది ఈ చెట్టును చూసి చర్చించుకోవడం మరో హైలెట్‌గా కనిపించింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..