Hyderabad: పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు… ఒకరు మృతి

.బాబుకన్‌ లేక్‌ వద్ద బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి..వీరిని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పిస్తా హౌస్ ఫ్లైఓవర్‌ ఎదురుగా ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు కిమ్స్‌ హాస్పిటల్ ఎదురుగా రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు అయ్యాయి..వీరిని కిమ్స్‌

Hyderabad: పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు... ఒకరు మృతి
Police Book Drunk Man
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Apr 16, 2024 | 10:23 AM

సైబరాబాద్ లో మందుబాబు వీరంగం సృష్టించాడు…తప్ప తాగి, కనిపించిన వారిని ఢీ కొట్టుకుంటూ వెళ్ళాడు…ఆరు ప్రాంతాల్లో వాహనాలు ఢీ కొట్టుకుంటూ బీభత్సం సృష్టించాడు..నిందితుడిని వెంబడించి పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు..ఈ ఘటనల్లో 11 మందికి గాయాలు కాగా, ఒకరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

మద్యం సేవించి ఏ మాత్రం సృహ లేకుండా వరుస ప్రమాధాలు చేసుకుంటూ వెళ్ళాడు ఓ మందు బాబు…పీకల్లోతు తాగి వాహనం నడిపాడు..రోడ్డు పై కనిపించినమనుషులను,వాహనాలను ఢీ కొట్టుకుంటూ వెళ్ళాడు..నిందితుడు నీ వెంబడించి పట్టుకున్న వాహనదారులు..నిజంపేట కు చెందిన క్రాంతి కుమార్ యాదవ్ గా గుర్తించారు పోలీసులు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 550గా రీడింగ్ వచ్చినట్లు సమాచారం..దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఎలా ఉందనేది. నిందితుడు పై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

తప్ప తాగిన నిందితుడు క్రాంతి ప్రమాదాలు చేసిన వివరాలు ఐకియా రోటరీ వద్ద ఎర్టిగా కార్‌ను ఢీ కొనగా ముజామ్మిల్‌ అహ్మద్, సయ్యెదా ఇమాన్‌ సర్వరీ అనే ఇద్దరికీ గాయాలు చేసాడు..బాబుకన్‌ లేక్‌ వద్ద బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి..వీరిని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పిస్తా హౌస్ ఫ్లైఓవర్‌ ఎదురుగా ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. మరోవైపు కిమ్స్‌ హాస్పిటల్ ఎదురుగా రెండు బైక్‌లను ఢీకొట్టడంతో నలుగురికి గాయాలు అయ్యాయి..వీరిని కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు..కిమ్స్‌ హాస్పిటల్‌ ఎదురుగా ఆటోలో ఢీ కొట్టగా ఉన్న ముగ్గురికి గాయాలు అవ్వగా వారి ముగ్గురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు…కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles