Telangana: ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతి రాబందులు.. మహిళా ఎస్సైతో సహా ముగ్గురు అరెస్ట్!

రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు అవినీతి అధికారుల బండారం బట్టబయలైంది. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఓ మహిళా ఎస్సైతోపాటు ఆర్టీసీ డిపో మేనేజర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతి రాబందులు.. మహిళా ఎస్సైతో సహా ముగ్గురు అరెస్ట్!
Three Officials Arrested For Taking Bribe In Telangana
Follow us

|

Updated on: Apr 16, 2024 | 9:57 AM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 16: రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు అవినీతి అధికారుల బండారం బట్టబయలైంది. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఓ మహిళా ఎస్సైతోపాటు ఆర్టీసీ డిపో మేనేజర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్కైయ్యారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జ్ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం..

బూరుగూడలో ఎస్సై రాజ్యలక్ష్మి..

ఆసిఫాబాద్‌ మండలంలోని బూరుగూడలో మార్చి 31న కారు, బైక్‌ ఢీకొన్న కేసులో స్టేషన్‌ బెయిల్‌ కోసం ఎస్సై రాజ్యలక్ష్మి రూ.40 వేల లంచం డిమాండ్‌ చేశారు. అంత ఇవ్వలేనని కారు యజమాని యాహియాఖాన్‌ చెప్పడంతో రూ.25 వేలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు యాహియాఖాన్‌ గుట్టుగా అనిశా అధికారులకు ఈ విషయం చేరవేశాడు. వారి సూచనల మేరకు సోమవారం స్టేషన్‌లో ఎస్సైకి రూ.25 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సడెన్‌ ఎంట్రీ ఇచ్చి రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎస్సై రాజ్యలక్ష్మిని కరీంనగర్‌ అనిశా కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఆయన తెలిపారు.

హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌..

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండెపల్లికి చెందిన తాటికొండ రవీందర్‌ కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనపై జారీ అయిన ఛార్జి మెమోను ఎత్తివేయాలని డ్రైవర్‌ రవీందర్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ను కోరాడు. అయితే అతను రూ.30 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో రవీందర్‌ తొలుత రూ.10 వేలు ఇవ్వగా.. మిగిలిన రూ.20 వేలు కూడా ఇచ్చాకే ఛార్జి మెమో ఎత్తేస్తానని శ్రీకాంత్‌ తెగేసి చెప్పాడు. దీంతో బాధితుడు రవీందర్‌ వరంగల్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. వారి సూచన మేరకు ఓ హోటల్‌లో డీఎం శ్రీకాంత్‌కు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసినట్లు అనిశా డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

కొత్తగూడెంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌..

నల్గొండ జిల్లా కొత్తగూడెం ప్రాంతంలో నూకల వెంకట్‌రెడ్డి చారిటబుల్‌ ఆసుపత్రిలో మెడికల్ షాప్‌ పెట్టుకోవడానికి అనుమతి కోరుతూ ఇన్‌ఛార్జి చిట్టెపు సైదిరెడ్డి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాడు. అనుమతి ఇవ్వడానికి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమేశ్వర్‌ రూ.20 వేల డిమాండ్‌ చేయగా.. చివరకు రూ.18 వేలకు ఫైనల్‌ చేసుకున్నారు. దీనిపై బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించగా.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌కు నల్గొండలోని ఆయన కార్యాలయంలో రూ.18 వేలు ఇచ్చాడు. డబ్బును బ్యాగులో పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, అరెస్ట్ చేసినట్లు అనిశా డీఎస్పీ జగదీశ్‌ చందర్‌ తెలిపారు. పై ఈ ముగ్గురిని కోర్టులో హాజరుపరచనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.