AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: ఇదెక్కడి విడ్డూరం బాబోయ్‌.. సౌదీ అరేబియాలో ఎడారి మాయం..! ఇసుక దిబ్బలు ఏమయ్యాయంటే..

ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రాంతానికి సంబంధించిన వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాలో మిలియనీరెస్‌స్టెప్స్ అనే ఖాతా ద్వారా షేర్‌ చేయగా... ఇప్పటి వరకు వీడియోకు 27 వేల మందికి పైగా చూశారు. కామెంట్ల ద్వారా ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అంటున్నారు.. 'ఇది ప్రపంచం అంతం కాబోతుందని చెప్పడానికి సంకేతం అంటున్నారు.

Viral Post: ఇదెక్కడి విడ్డూరం బాబోయ్‌.. సౌదీ అరేబియాలో ఎడారి మాయం..! ఇసుక దిబ్బలు ఏమయ్యాయంటే..
Saudi
Jyothi Gadda
|

Updated on: Apr 16, 2024 | 7:49 AM

Share

సౌదీ అరేబియా ఎడారి అంటేనే మండే వేడి వాతావరణం అంటారు. చుట్టూ ఇసుకతో నిండిన ఎడారి మాత్రమే కనిపిస్తుంది. ప్రజలు ఈ దేశాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడల్లా, వారు ఖచ్చితంగా ఇక్కడి ఎడారిని చూస్తారు. అయితే, మీరు కూడా ఈ సారి సౌదీ వెళ్లినప్పుడు ఈ ఎడారిని చూడాలనుకుంటే..మీ కోరిక నెరవేరకుండానే మిగిలిపోతుంది.. ఎందుకంటే ఎడారిగా పేరుగాంచిన సౌదీ అరేబియా పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇక్కడి ఎండారి కొండల్లో ఎటు చూసినా పచ్చదనం అలుముకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది.

ఒకప్పుడు ఇసుకతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు ఆకుపచ్చ రంగును అద్దుకున్నాయి. సౌదీ అరేబియా ఎడారికి చెందినది ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో సౌదీ ఎడారి కొండ ప్రాంతాలలో ఇసుక దిబ్బలకు బదులుగా ఆశ్చర్యకరమైన పచ్చదనంతో పచ్చిక బయళ్లు కనిపిస్తున్నాయి. ఇందులో ఒంటెలు ఆనందంగా ఆ గడ్డిని మేస్తున్నాయి. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ వర్షాలు కురవడం, పచ్చదనం కనిపించడం చాలా ప్రత్యేకమైన దృగ్విషయంగా చెబుతున్నారు చాలా మంది. ఇది చూసి సాధారణ మనుషులే కాదు శాస్త్రవేత్తలు కూడా షాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ చూస్తుంటే ఇప్పుడు ప్రపంచానికి ఎండిపోయిన ఎడారి సౌదీ అంటే ఎవరూ నమ్మలేరు. ఎడారి ఒంటెను ఎక్కడికో తరలించినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ క్లిప్‌ను ఇన్‌స్టాలో మిలియనీరెస్‌స్టెప్స్ అనే ఖాతా ద్వారా షేర్‌ చేయబడింది. ఇప్పటి వరకు వీడియోకు 27 వేల మందికి పైగా చూశారు. కామెంట్ల ద్వారా ప్రజలు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా అంటున్నారు.. ‘ఇది ప్రపంచం అంతం కాబోతుందని చెప్పడానికి సంకేతం అంటున్నారు. ఎడారిలో పచ్చదనాన్ని పెంపొందించటం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నం సక్సెస్‌ అవుతుందని మరికొందరు అంటున్నారు. ఈ వీడియో ఈ సంవత్సరం జనవరి నాటిదని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బహుశా వాతావరణంలో మార్పు కారణంగా అధిక వర్షం, ఆకస్మిక వరదలు సంభవించాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..