Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా చేతి వేళ్లు నరికేయండి ప్లీజ్‌’ అంటూ వింత వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి.. డాక్టర్లకే అంతుచిక్కని రోగం..!

ఇది చాలా అరుదైన పరిస్థితి. ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న రోగిలో వికలాంగుడిగా మారాలనే వింత కోరిక బలంగా ఉంటుంది. ఇలాంటిదే మరో కేసు గతంలో కూడా వచ్చిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒక మహిళకు కూడా ఇదే సమస్య ఉంది. నడుము నుండి కిందకి పక్షవాతం వచ్చిందని కలలు కంటూ, చక్రాల కుర్చీలో తిరుగుతూ, కాళ్లకు ఇనుప రాడ్లు కట్టుకుని దివ్యాంగురాలిలా బతుకుతోందని చెప్పారు.

'నా చేతి వేళ్లు నరికేయండి ప్లీజ్‌' అంటూ వింత వ్యాధితో పోరాడుతున్న వ్యక్తి.. డాక్టర్లకే అంతుచిక్కని రోగం..!
Biid
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 16, 2024 | 7:07 AM

ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. వాటిలో చాలా వాటి గురించి మనకు తెలియదు. ఎందుకంటే ఆ వ్యాధులు మిలియన్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయి. కొన్నిసార్లు వైద్యులు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారు కూడా ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వ్యాధులను ఎదుర్కోలేదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి.. ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చి తన వేళ్లు కత్తిరించమని అడిగితే, మీకు ఎలా అనిపిస్తుంది..? సహజంగానే మీరు షాక్ అవుతారు కదా. కెనడియన్ వైద్యుడికి కూడా అలాంటి సంఘటనే ఎదురైంది. క్యూబెక్ నగరానికి చెందిన ఒక 20ఏళ్ల యువకుడు డాక్టర్‌ వద్దకు వెళ్లి, తన ఎడమ చేతి నుంచి రెండు వేళ్లను శాశ్వతంగా తొలగించమని కోరాడు. ఎందుకంటే అతను..ఆ రెండు వేళ్లు తన శరీరంలో లేవనే భావనలో ఉన్నాడట. ఈ విషయాన్ని ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్‌లో పేర్కొంది. నివేదిక ప్రకారం, లావల్ విశ్వవిద్యాలయంలోని మనోరోగచికిత్స విభాగానికి చెందిన డాక్టర్ నాడియా నాడియో ఇటీవల ఒక అంతుచిక్కని, వింత రోగి గురించి ఒక కేసు నివేదికను ప్రచురించారు. దీనిలో రోగి చిన్ననాటి నుండి బాధాకరమైన ఆలోచనలను అనుభవిస్తున్నారని చెప్పారు.. అతడు తన శరీరంలోని ఎడమ చేతి చివరి రెండు వేళ్లు కనిపించకుండా పోయినట్లుగా భావిస్తున్నాడని పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు…

రోగి తన రెండు వేళ్లు కుళ్లిపోతున్నాయని లేదా కాలిపోతున్నాయని భావించి పిచ్చివాడిగా ప్రవర్తిస్తున్నారని డాక్టర్ నాడియా చెప్పారు. విచిత్రం ఏమిటంటే, అతను తన తీవ్రమైన సమస్యను ఇబ్బందిగా భావించి తన కుటుంబానికి కూడా చెప్పలేదు. కానీ అతను ఆ వేళ్లను తానే తొలగించుకుంటానని మాత్రం ఎప్పుడూ అనుకోడని చెప్పారు. ఇంతకీ ఈ వింత వ్యాధి ఏంటంటే..డాక్టర్ నాడియా ప్రకారం, రోగి బాడీ ఇంటెగ్రిటీ ఐడెంటిటీ డిజార్డర్ (BIID). ఇది చాలా అరుదైన పరిస్థితి. ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న రోగిలో వికలాంగుడిగా మారాలనే వింత కోరిక బలంగా ఉంటుంది. ఇలాంటిదే మరో కేసు గతంలో కూడా వచ్చిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒక మహిళకు కూడా ఇదే సమస్య ఉంది. నడుము నుండి కిందకి పక్షవాతం వచ్చిందని కలలు కంటూ, చక్రాల కుర్చీలో తిరుగుతూ, కాళ్లకు ఇనుప రాడ్లు కట్టుకుని దివ్యాంగురాలిలా బతుకుతోందని తెలిసింది.

ఇవి కూడా చదవండి

BIIDకి కారణమేమిటి..?

బాడీ ఇంటెగ్రిటీ ఐడెంటిటీ డిజార్డర్ (BIID)కు కారణమేమిటో వైద్యులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. శరీర అవగాహనను నియంత్రించే మనిషి మెదడులోని నిర్మాణపరమైన అసాధారణతల ఫలితంగా ఇది ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. బాధితులు తమ శరీరం గురించి అబ్సెసివ్ ఆలోచనలు కలిగి ఉంటారని, విపరీతమైన ఒత్తిడి లేదా ఆందోళనతో డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. ఇలాంటి భావాలు సాధారణంగా బాల్యంలో, ప్రారంభ కౌమారదశలో మొదలవుతాయని వైద్యులు వెల్లడించారు. తరచుగా 5-10 సంవత్సరాల మధ్య వయస్సులో ఉంటాయని వైద్యులు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..