అదృష్టం అంటే ఈ వృద్ధురాలిదే.. లాటరీలో రూ. 31 కోట్ల విలువైన ఇంటిని గెలుచుకున్న 73 ఏళ్ల మహిళ
లక్ కలిసి వస్తే క్షణంలో లక్షాధికారులు, బిలియనీర్లు కూడా అవుతారు. ప్రపంచంలో రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇదంతా లాటరీ టిక్కెట్ ద్వారా సాధ్యమైంది. అవును లాటరీ చాలా మందిని లక్షాధికారులను చేసింది. అలాంటి ఓ వృద్ధ మహిళ ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఏకంగా రూ.31 కోట్లకు ఓనర్‌గా మారింది. విశేషమేమిటంటే.. ఆ మహిళ ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రమే.. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఏకంగా కోట్ల రూపాయలు రావడం..అదృష్టమే అని చెప్పవచ్చు.
ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క క్షణం చాలు లక్షాధికారులైనా, బిచ్చగాళ్ళైనా అవ్వడానికి.. దురదృష్టం వెంటాడితే ఒక్క క్షణంలో ధనవంతుల నుంచి బిచ్చగాళ్ళుగా మారిపోతారు. అదే సమయంలో లక్ కలిసి వస్తే క్షణంలో లక్షాధికారులు, బిలియనీర్లు కూడా అవుతారు. ప్రపంచంలో రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇదంతా లాటరీ టిక్కెట్ ద్వారా సాధ్యమైంది. అవును లాటరీ చాలా మందిని లక్షాధికారులను చేసింది. అలాంటి ఓ వృద్ధ మహిళ ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తోంది. ఏకంగా రూ.31 కోట్లకు ఓనర్‌గా మారింది. విశేషమేమిటంటే.. ఆ మహిళ ఆర్థిక పరిస్థితి అంతఅంత మాత్రమే.. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఏకంగా కోట్ల రూపాయలు రావడం..అదృష్టమే అని చెప్పవచ్చు.
ఆ మహిళ పేరు రోజ్ డోయల్. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. ఆమె ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ నివాసి. వెబ్‌సైట్ మెట్రో నివేదిక ప్రకారం వృద్ధురాలు రోజ్ గత 44 సంవత్సరాలుగా తన భర్తతో కలిసి మూడు పడక గదుల ఇంట్లో నివసిస్తోంది. అక్కడ ఆమెతో పిల్లలు కూడా నివసిస్తున్నారు. ఆ వృద్ధురాలి ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేవు, దీంతో ఆమె ఈ వయసులో కూడా రెండు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటిది ఆమె భీమా సంస్థలో ఏజెంట్‌గా పని చేస్తోంది. రెండవది ఆమె ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు వంటమనిషిగా కూడా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఆమెకు అదృష్టం కలిసి వచ్చింది.
నివేదికల ప్రకారం రోజ్ ఓమేజ్ అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలు. ఆమె ఆ సంస్థలో ప్రతి నెలా వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడుతుంది. వాస్తవానికి ఆ సంస్థ ఒక లక్కీ డ్రాను నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు కొంత డబ్బులు లేదా ఇతర బహుమతులు ఇస్తుంది. దీంతో తనకు ఏదైనా చిన్న బహుమతి లభిస్తుందనే ఆశతో ప్రతిరోజూ పెట్టుబడి పెడుతోంది. అయితే ఆ మహిళ విధి రాత మారింది. లక్కీ డ్రాలో రోజ్ లక్ష పౌండ్లు అంటే దాదాపు రూ.31 కోట్లు గెలుచుకుంది. బహుమతిగా ఆమెకు కార్న్‌వాల్ ప్రాంతంలో ఉన్న ఒక విలాసవంతమైన ఐదు పడక గదుల ఇల్లు ఇచ్చారు. ఈ ఇల్లు అనేక సౌకర్యాలను కలిగి ఉంది. ఇందులో అందమైన తోట, హాట్ టబ్ సహా అనేక సదుపాయాలున్నాయి.
‘ఈ బహుమతి అద్భుతం కంటే తక్కువ కాదు’
ఇంత పెద్ద బహుమతి వస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇంతకుముందు చాలాసార్లు లక్కీ డ్రాల్లో ఇన్వెస్ట్ చేశానని.. అయితే ఇంతవరకు ఏమీ రాలేదని రోజ్ చెప్పింది. ఈ బంపర్ అవార్డు తన జీవితాన్ని మార్చేసిందని.. ఇది అద్భుతం కంటే తక్కువ కాదని రోజ్ పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..