ఈ ఆలయంలో అన్నీ రహస్యాలే.. అమ్మవారు రోజుకు 3సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది!

ఈ ఆలయంలో ఉన్న ధారీ దేవి  విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం. ధారీ దేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా, మధ్యాహ్నం యువతిలా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. ధారీ దేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా ధారీ దేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది.

ఈ ఆలయంలో అన్నీ రహస్యాలే.. అమ్మవారు రోజుకు 3సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది!
Dhari Devi Temple
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2024 | 8:38 PM

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్, రుద్రప్రయాగ మధ్య అలకనంద నది ఒడ్డున ధారీ దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం శ్రీనగర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కాళీ దేవికి అంకితం చేయబడింది. అమ్మవారి అద్భుతాలను చూసేందుకు భక్తులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ ఉన్న ధారీ దేవి ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ను రక్షిస్తుందని ఒక నమ్మకం. అందువల్ల, ధారీ దేవి పర్వతాలను, యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు. ధారీ దేవి విగ్రహం పైభాగం ఈ ఆలయంలో ఉంది. అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత ఆలయంలో ఉంది. ఇక్కడ ఆమె కాళీ దేవి రూపంగా పూజించబడుతుంది.

ఆలయంలో ఈ అద్భుతం జరుగుతుంది

నమ్మకం ప్రకారం ఈ ఆలయంలో ఉన్న ధారీ దేవి  విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం. ధారీ దేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా, మధ్యాహ్నం యువతిలా, సాయంత్రం వృద్ధురాలిగా కనిపిస్తుంది. ధారీ దేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆలయానికి సంబంధించిన నమ్మకం

పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా ధారీ దేవి ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది. ఈ విగ్రహం ధరో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది. ఈ విగ్రహం నుంచి ఒక దివ్య స్వరం వెలువడిందని అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు. దీని తరువాత  ధరో గ్రామ ప్రజలు కలిసి అక్కడ ధారీ దేవి ఆలయాన్ని నిర్మించారు. పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపర యుగంలో ధారీ దేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు.

ఇవి కూడా చదవండి

ఆలయాన్ని కూల్చివేయడంతో భయంకరమైన వరద

ధారీ దేవి ఆలయాన్ని 2013 సంవత్సరంలో కూల్చివేసి, ఆమె విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించారని చెబుతారు. దీని కారణంగా 2013 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లో భయంకరమైన వరదలు సంభవించాయని.. అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతారు. 16 జూన్ 2013 సాయంత్రం ధారీ దేవి విగ్రహాన్ని తొలగించారని .. కొన్ని గంటల తర్వాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు. తర్వాత మళ్లీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!