Bhadrachalam: రాములోరి కల్యాణ ప్రసాదం, తలంబ్రాలు మీ చెంతకే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
భద్రాచలం వెళ్లలేని భక్తుల చెంతకు కూడా శ్రీ రామ నవమి సందర్భంగా అంత్రాలయ అర్చన-తలంబ్రాల సేవ ఆర్డర్‌లను బుక్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది తెలంగాణ పోస్టల్ సర్కిల్. ఈ క్రార్యక్రమానికి దేవాదాయ శాఖ సహకారం కూడా పోస్టల్ శాఖ తీసుకుంది. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు ఏప్రిల్ 13 నుంచి 16 మధ్య తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఆర్డర్లు చేయవచ్చు.
దక్షిణ అయోధ్య భద్రాద్రిలో ఈ నెల 17వ తేదీన రామయ్య కళ్యాణం నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. రాములోరి కళ్యాణం కనులారా చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు భద్రాచలం చేరుకుంటారు. మరోవైపు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన అక్షతలను, తలంబ్రాలను ప్రతి ఒక్క భక్తులు సొంతం చేసుకోవాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు. అయితే భద్రాచలం వెళ్లలేని భక్తుల చెంతకు కూడా శ్రీ రామ నవమి సందర్భంగా అంత్రాలయ అర్చన-తలంబ్రాల సేవ ఆర్డర్‌లను బుక్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది తెలంగాణ పోస్టల్ సర్కిల్. ఈ క్రార్యక్రమానికి దేవాదాయ శాఖ సహకారం కూడా పోస్టల్ శాఖ తీసుకుంది. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు ఏప్రిల్ 13 నుంచి 16 మధ్య తెలంగాణలోని పోస్టాఫీసుల్లో ఆర్డర్లు చేయవచ్చు.
భక్తులకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నుంచి ప్రసాదం, ముత్యాల కల్యాణ తలంబ్రాలు భక్తుల చిరునామా ద్వారా ఇంటి గడపకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిణీ చేయబడతాయి.
శ్రీ రామ నవమి తర్వాత ఆలయంలోని ప్రసాదాలు, ముత్యాల కల్యాణ తలంబ్రాలు స్పీడ్‌పోస్టు ద్వారా భక్తులకు అందజేస్తారు. అంతరాలయ అర్చన-కళ్యాణ తలంబ్రాలు కోసం, భక్తులు రూ. 450, ముత్యాల తలంబ్రాల కోసం రూ. 150 చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు భద్రాచలంలో జరగనున్న శ్రీ రామ నవమి, పట్టాభిషేకం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారని అంచనా వేసిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..