ఉద్యోగం కోసం పరీక్ష రాస్తున్న తల్లి.. ఏడుస్తున్న చిన్నారికి తల్లి అయిన మహిళా పోలీసు
గుజరాత్ హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఒక మహిళ తన 6 నెలల పాపతో వచ్చింది. ఇక్కడ పిల్లలతో పాటు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం లేదు. అయినప్పటికీ ఆ తల్లికి తన చిన్నారిని పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి వచ్చింది. అయితే పరీక్షా కేంద్రం వద్ద ఉన్న పోలీసు సిబ్బంది ఆమెకు మద్దతుగా నిలిచారు. గుజరాత్‌లోని ఓధవ్‌లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాస్తున్న మహిళ బిడ్డను చూసుకుంటున్న మహిళా కానిస్టేబుల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరికైనా పోటీ పరీక్షలు రాయాలనే కోరికతో పాటు ఉత్సాహం ఉండాలి. ఎవరికైనా రాసే సత్తా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాయగలరని, అలాంటి పనికి కుటుంబసభ్యులు అయినా, బయటి వ్యక్తులైనా సరే మనల్ని ఆదరించే, సహకరించే వాళ్లు కావాలి అనడానికి ఉదాహరణ ఈ మహిళ. అవును గుజరాత్ లో అలాంటి సంఘటనే జరిగింది. గుజరాత్ హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు ఒక మహిళ తన 6 నెలల పాపతో వచ్చింది. ఇక్కడ పిల్లలతో పాటు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం లేదు. అయినప్పటికీ ఆ తల్లికి తన చిన్నారిని పరీక్షా కేంద్రానికి తీసుకురావాల్సి వచ్చింది. అయితే పరీక్షా కేంద్రం వద్ద ఉన్న పోలీసు సిబ్బంది ఆమెకు మద్దతుగా నిలిచారు.
గుజరాత్‌లోని ఓధవ్‌లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష రాస్తున్న మహిళ బిడ్డను చూసుకుంటున్న మహిళా కానిస్టేబుల్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కానిస్టేబుల్ దయా బెన్ 6 నెలల పాపను పట్టుకుని ఆడుకుంటున్న దృశ్యాన్ని ఈ ఫోటోలో చూడవచ్చు.
ઓઢવ ખાતે પરીક્ષા આપવા માટે આવેલ મહીલા પરીક્ષાર્થીનુ બાળક રોતું હોય જેથી મહિલા પરીક્ષાથી નું પેપર દરમિયાન સમય બગડે નહીં અને પરીક્ષા વ્યવસ્થિત રીતે આપી શકે તે સારું મહિલા પોલીસ કર્મચારી દયાબેન નાઓએ માનવીય અભિગમ દાખવી બાળકને સાચવેલ જેથી માનવીય અભિગમ દાખવવામાંઆવેલ છે pic.twitter.com/SIffnOhfQM
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 9, 2023
ఈ పోస్ట్ శీర్షిక ప్రకారం గుజరాత్ హైకోర్టు ప్యూన్ పోస్టుకు హాజరు కావడానికి ఒక మహిళ తన ఆరు నెలల పాపతో ఓధవ్ పరీక్షా కేంద్రానికి వచ్చింది. మరికొద్ది నిమిషాల్లో పరీక్ష ప్రారంభమవుతుందని చెబుతున్నారు.. ఆ సమయంలో తల్లి చేతిలో ఉన్న చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. ఈ సమయంలో తల్లి పరీక్ష రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మహిళా కానిస్టేబుల్ చిన్నారిని చూసుకునేందుకు ముందుకు వచ్చింది. స్వయంగా తల్లిలా చిన్నారి ఏడవకుండా శాంతింపజేసింది.
ఆ తల్లి పరీక్ష రాసే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా పరీక్ష రాయగలిగేలా ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతను తమ సిబ్బంది తీసుకున్నారని పోలీసు శాఖ తమ ట్విట్టర్ పోస్ట్‌లో క్యాప్షన్ ఇచ్చి ఫోటోలు షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో అన్ని చోట్ల వైరల్‌గా మారింది. పోలీసు సిబ్బంది గొప్పగా అభినందిస్తున్నారు.
“మేడమ్ మీరు చేసిన పనిని చూసి మేము గర్విస్తున్నాము” అని ఒకరు రాశారు. మరొకరు ఇది నిజమైన పోలీసు అధికారి పని అని ట్విట్టర్‌లో కామెంట్ చేస్తూ పోలీసు డిపార్ట్ మెంట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..