భద్రాచల రామాలయం అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలో శ్రీరామ నవమి ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం ఎంతుందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పర్ణశాలలో రామాయణ ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపే బాపు విగ్రహాలను విరిగిపోయాయి. వెదురుతో నిర్మించిన కుటీరం పెచ్చులు లేచిపోయాయి. రామాలయ ప్రాంగణానికి రంగులు వేయకుండా లైటింగ్ దండలు వేయడంతో భక్తులు ముక్కున వేలేసుకుని అయ్యోరామా ఏమిటి ఖర్మ అని అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.