AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న ఓ నమ్మకం.. జీవితానికి భరోసా.. పిల్లల్ని స్కూల్‌కు ట్రైసైకిల్‌లో తీసుకెళ్తున్న తండ్రి.. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో..

లోకంలో ఏ కష్టాలు వచ్చినా తన పిల్లలకు తండ్రి రక్షణ కవచంలా నిలుస్తాడు. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కావాలా కావాలా కాస్తాడు. అందుకే పిల్లల జీవితంలో నాన్న ఓ నమ్మకం… ఓ రియల్ హీరో.. నాన్న అంటే గర్వం.. నాన్న జీవించి ఉండగా పిల్లలకు ఎటువంటి హాని కలగదు.. అందుకు సజీవ సాక్ష్యం ఈ వీడియో .. ట్విట్టర్ లో కనిపిస్తున్న ఈ వీడియో చూపరుల కంట కన్నీరు పెట్టిస్తోంది.

నాన్న ఓ నమ్మకం.. జీవితానికి భరోసా.. పిల్లల్ని స్కూల్‌కు ట్రైసైకిల్‌లో తీసుకెళ్తున్న తండ్రి.. హృదయాన్ని కదిలిస్తున్న వీడియో..
Specially Abled Father Drop Kids
Surya Kala
|

Updated on: Apr 15, 2024 | 4:01 PM

Share

ఇంటర్నెట్ ప్రపంచంలో యాక్టివ్‌గా ఉన్నట్లయితే ప్రతిరోజూ ఏదో ఒక వీడియో ప్రజల మధ్య చర్చలో ఉంటుంది. ఈ వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. కొన్ని వీడియోలు చూసిన తర్వాత మన ముఖంలో చిరునవ్వు తెప్పిస్తే, కొన్ని వీడియోలు కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి వీడియో చర్చనీయాంశమైంది. ఇది చూస్తే జీవితంలో తండ్రి విలువ ఏంటో ఎవరికైనా అర్థమవుతుంది.

ఒక తండ్రి తన పిల్లల కోసం ఎంత దూరమైనా వెళ్ళగలడు. తన పిల్లల కోసం ఏమైనా చేయగలడు అనే విషయం మనందరికీ తెలుసు. లోకంలో ఏ కష్టాలు వచ్చినా తన పిల్లలకు తండ్రి రక్షణ కవచంలా నిలుస్తాడు. తన పిల్లలకు కష్టం దరి చేరకుండా కావాలా కావాలా కాస్తాడు. అందుకే పిల్లల జీవితంలో నాన్న ఓ నమ్మకం… ఓ రియల్ హీరో.. నాన్న అంటే గర్వం.. నాన్న జీవించి ఉండగా పిల్లలకు ఎటువంటి హాని కలగదు.. అందుకు సజీవ సాక్ష్యం ఈ వీడియో .. ట్విట్టర్ లో కనిపిస్తున్న ఈ వీడియో చూపరుల కంట కన్నీరు పెట్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వీడియోలో వికలాంగుడైన తండ్రి తన పిల్లలను వీల్ చైర్‌లో తీసుకుని వెళ్లి పాఠశాలలో దింపుతున్నాడు. తండ్రి తన ట్రైసైకిల్‌పై ముందు, వెనుక సీట్లలో పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు. ఒక పిల్లవాడు తన తండ్రి ఒడిలో ముందు కూర్చుని, మరొక పిల్లవాడు వెనుక కూర్చున్నాడు. ట్రాఫిక్ మధ్యలో తన చేతులతో ట్రైసైకిల్ నడుపుతూ వారిని పాఠశాలకు తీసుకెళుతున్నాడు. ఎవ్వరినైనా భావోద్వేగానికి గురి చేసేలా ఈ వీడియో ఉంది.

ఈ వీడియో @dc_sanjay_jas అనే ఖాతా ద్వారా Xలో షేర్ చేశారు. హృదయాన్ని కదిలిస్తున్న ఈ వీడియో  వేల మంది చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తమ తమ స్పందనలు తెలియజేస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశాడు, ‘తండ్రి ప్రేమ పైకి కనిపించదు.. తండ్రి కృషి గురించి ఏమి చెప్పాలి.’ ‘ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుడైన వ్యక్తికి, తన పిల్లలకు తండ్రి ఆకాశం.. అటువంటి వ్యక్తికి  వందనాలు’ అని మరొకరు రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..