AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navami: శ్రీరామ నవమి రోజున ఈ పని చేస్తే చాలు..ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు..

వసంత నవరాత్రులు పూర్తి కావడమే కాదు శ్రీ రామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా చేస్తారు.  సీతారాముల కళ్యాణం జరిపిస్తారు.  అయితే ఈ మహానవమి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా.. జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు. ఈ రోజు నవమి తిథికి సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సిరి సంపదలు నెలకొంటాయి. 

Chaitra Navami: శ్రీరామ నవమి రోజున ఈ పని చేస్తే చాలు..ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు..
Srirama Navami 2024
Surya Kala
|

Updated on: Apr 15, 2024 | 2:27 PM

Share

చైత్ర మాసం శుక్ల పక్ష నవమి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుతో వసంత నవరాత్రులు పూర్తి కావడమే కాదు శ్రీ రామ నవమి వేడుకలను అత్యంత ఘనంగా చేస్తారు.  సీతారాముల కళ్యాణం జరిపిస్తారు.  అయితే ఈ మహానవమి రోజున కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా.. జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు. ఈ రోజు నవమి తిథికి సంబంధించిన కొన్ని చర్యల గురించి తెలుసుకుందాం.. వీటిని పాటించడం ద్వారా ఇంట్లో ఏడాది పొడవునా సిరి సంపదలు నెలకొంటాయి.

చైత్ర నవమి రోజున  ఐశ్వర్యం పొందాలంటే ఈ పనులు చేయండి..

మహానవమి రోజున శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించండి. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సును తెస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు లేదా అప్పుల బాధలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ద్వారా సంపదను పొందగలరని నమ్మకం.

నవమి తిథి రోజున అమ్మవారికి తామర లేదా ఎర్రని పుష్పాలను సమర్పించి..  శ్రీ సూక్తం పఠించండి. ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

ఇవి కూడా చదవండి

గ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి

నవమి రోజున 5 గవ్వలు తీసుకుని, వాటిని ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈ పరిహారం చేయడం వల్ల శని, రాహువు, కేతువులకు సంబంధించిన చెడు ప్రభావాలు తొలగిపోయి జీవితంలో సంతోషం వస్తుందని నమ్ముతారు.

వ్యాధి నుండి బయటపడటానికి ఈ నివారణలను ప్రయత్నించండి

ఏదైనా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నవమి రోజున దుర్గా దేవిని ధ్యానిస్తూ ఆగ్నేయ దిశలో అంటే ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొంది మంచి ఆరోగ్యాన్ని పొందే అనుగ్రహాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారం శత్రువులపై విజయాన్ని కూడా అందిస్తుంది.

మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ చర్యలు చేయండి

కోరుకున్న కోరిక నెరవేరాలంటే నవమి రోజున దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున దుర్గా సప్తశతి మొత్తం పారాయణం చేయలేకపోతే కనీసం దాని పన్నెండవ అధ్యాయాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

వివాహిత మహిళలు ఈ చర్యలు తీసుకోవాలి

వివాహిత స్త్రీలు సిద్ధిదాత్రికి వివాహ పసుపు, కుంకుమ గాజులు వంటివి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవిత భాగస్వామి జీవితంలో సమస్యలు తొలగిపోయి శుభం కలుగుతుంది.

చిత్ర శుద్ధ నవమి తిథి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున మీరు పైన పేర్కొన్న చర్యలను అనుసరిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో పాటు కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున కొత్త పనిని ప్రారంభించడం ఖచ్చితంగా విజయాన్ని తెస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..