Viral Video: పుట్టినరోజు అంటే ఇది కదా.. మీ పిల్లల బర్త్ డేస్ కూడా ఇలా చేయండి
పుట్టాం అంటే పోయే రోజు కూడా ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో మనం ఎంత మంచి చేశాం.. ఎంతమంది మనసులు గెలుచుకున్నాం అనేదే లెక్క. అలా అని రోజూ సేవా కార్యక్రమాలు చేయాలి.. మీ డబ్బులు అని వాటికే ఖర్చు పెట్టాలి అనడం లేదు. మీ పుట్టిన రోజు ఇలా చిన్న సాయం చేసి కూడా వేరే వాళ్ల ఆశీస్సులు పొందొచ్చు.
పిల్లలు పుట్టిన రోజు అంటే ఏం చేస్తారు..? ఉదయాన్నే లేచి తలస్నానం చేసి.. అమ్మనాన్నలు తెచ్చిన కొత్త దుస్తులు ధరిస్తారు. వారి ఆశీర్వాదం తీసుకుని.. కేట్ కట్ చేసి.. ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారు. లేదంటే.. చుట్టుపక్కల ఇళ్లవాళ్లకి, స్కూల్లోని ఫ్రెండ్స్, క్లాస్ మేట్స్‌కి చాక్లెట్లు, స్వీట్లు పంచుతారు. ఇది మిడిల్ క్లాస్ ఇళ్లల్లో ఉండే సంగతి. రిచ్ వాళ్ల ఇళ్లల్లో పార్టీలు, కాస్ట్లీ గిఫ్టులు గట్రా కథ వేరే ఉంటుంది. స్పెషల్ డేని అలా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ రోజు మరో మనిషికి సాయం చేసి.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఇది కదరా లైఫ్ అనిపిస్తుంది. తాజాగా బర్త్ డేకి కొత్త అర్థం చెప్పే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఓ పిల్లోడు బర్త్ డే సందర్భంగా.. తన తండ్రిలో కలిసి వెళ్లి.. ఎండలో పూలు అమ్ముకుంటున్న వృద్ధ మహిళ వద్దకు వెళ్లి ఆమెకు ఓ కొత్త గొడుగు అందజేశారు. అంతేకాదు కాదు ఆమె ఓ కొత్త దుస్తులు కూడా ఇచ్చారు. దీంతో ఆ వృద్ధ మహిళ కల్మషం లేని చిరు నవ్వుతో ఆ చిన్నోడిని ఆశీర్వదించింది. పెంపకం అంటే ఇలా ఉండాలి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఈ సారి నా బర్త్ డే ఇలా చేసుకుంటాను అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. డియర్ బాయ్.. నువ్వు సంతోషంగా ఇలానే 100 బర్త్ డేలు జరుపుకోవాలని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.
వీడియో దిగువన చూడండి…
మీరు కూడా బర్త్ డేస్ అప్పుడు ఎప్పుడూ ఫ్రెండ్స్, పబ్బులు, పార్టీలు.. ఇవి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మనసు హ్యాపీగా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..