AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ramanavami: ఈ ఏడాది నవమి రోజున అరుదైన యోగం.. రామయ్య పూజా సమయం, శుభ ముహర్తం ఎప్పుడంటే

వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అటువంటి పరిస్థితిలో శ్రీరాముని జన్మ దినోత్సవాన్ని అభిజిత్ ముహూర్తంలో జరుపుకోవడం శుభపరిణామం. చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజు శుక్ల పక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామ నవమి నాడు చాలా అరుదైన, ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది. శ్రీరాముని జాతకంలో ఉన్న గజకేసరి యోగం ఈ రోజున ఏర్పడుతున్నందున ఈ సంవత్సరం రామనవమి పండుగ ప్రజలకు చాలా పవిత్రమైనది. ఈ కలయిక సంభవించినప్పుడు.. వ్యక్తి గజానికి (ఏనుగుకి) సమానమైన శక్తిని, సంపదను పొందుతాడు. ఈ ఏడాది శ్రీ రామ నవమి నాడు, ఈ యాదృచ్ఛికాలు కలిసి రావడంతో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Sri Ramanavami: ఈ ఏడాది నవమి రోజున అరుదైన యోగం.. రామయ్య పూజా సమయం, శుభ ముహర్తం ఎప్పుడంటే
Srirama Navami
Surya Kala
|

Updated on: Apr 15, 2024 | 4:54 PM

Share

తెలుగు క్యాలెండర్ లో మొదటి నెల చైత్ర మాసం. ఈ నెల నవమి రోజున శ్రీ రామ నవమిగా హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 17 ఏప్రిల్ 2024 బుధవారం శ్రీ రామ నవమి వచ్చింది. శ్రీ రామ నవమి శ్రీ రాముడు జన్మ దినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు.. రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు.. అవును చైత్ర మాసం నవమి రోజున విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీ రాముడిగా  అవతారం ఎత్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అటువంటి పరిస్థితిలో శ్రీరాముని జన్మ దినోత్సవాన్ని అభిజిత్ ముహూర్తంలో జరుపుకోవడం శుభపరిణామం. చైత్ర మాసంలోని తొమ్మిదవ రోజు శుక్ల పక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈసారి రామ నవమి నాడు చాలా అరుదైన, ప్రత్యేకమైన యాదృచ్ఛికం జరగనుంది.

శ్రీరాముని జాతకంలో ఉన్న గజకేసరి యోగం ఈ రోజున ఏర్పడుతున్నందున ఈ సంవత్సరం రామనవమి పండుగ ప్రజలకు చాలా పవిత్రమైనది. ఈ కలయిక సంభవించినప్పుడు.. వ్యక్తి గజానికి (ఏనుగుకి) సమానమైన శక్తిని, సంపదను పొందుతాడు. ఈ ఏడాది శ్రీ రామ నవమి నాడు, ఈ యాదృచ్ఛికాలు కలిసి రావడంతో అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.

శ్రీ రామ నవమి పూజ శుభ సమయం

పంచాంగం ప్రకారం రామ నవమి రోజున ఒక ప్రత్యేక శుభ ముహూర్తం ఉంది. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 1:40 గంటల మధ్య అభిజిత్ ముహూర్తం అని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో  రామజన్మోత్సవాన్ని జరుపుకుని రామయ్యకు హారతి ఇవ్వండి. అయితే ఎవరైనా పూజాభిషేకం, గృహనిర్మాణం, గృహప్రవేశం, దుకాణం ప్రారంభోత్సవం, కర్మాగార పూజలు, దుకాణ పూజలు వంటి ఏదైనా శుభకార్యాలు, ప్రారంభ పనులు చేయాలనుకుంటే.. అప్పుడు నవమి రోజున రోజుకు రెండు సార్లు ఉదయం 11:40 మధ్య, మధ్యాహ్నం 1:40 గంటలకు పూజ చేయడం చాలా శుభప్రదం.

ఇవి కూడా చదవండి

శ్రీ రామ నవమి పూజా సామగ్రి

శ్రీ రామ నవమి పూజలో సీతారామ లక్షణ హనుమంతుడి ఫోటో, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరం, పువ్వులు, దండ, మొదలైన వాటిని సమకూర్చుకోండి.

శ్రీరాముని ఇత్తడి లేదా వెండి విగ్రహానికి అభిషేకం కోసం పాలు, పెరుగు, తేనె, పంచదార, గంగాజలం సిద్ధం చేసుకోండి.

నైవేద్యానికి స్వీట్లు, పసుపు బట్టలు, ధూపం, దీపం, సుందరకాండ లేదా రామాయణ పుస్తకం, తమలపాకులు, ఖార్జురం ఉపయోగించండి.

ఐదు పండ్లు, పసుపు, ధూపం, దీపం, తులసి దళాలు, వంటి వాటిని పూజలో చేర్చుకోండి.

శ్రీ రామనవమి హవన కోసం కావలసిన సామాగ్రి

హవన పాత్ర, కర్పూరం, నువ్వులు, ఆవు నెయ్యి, యాలకులు, పంచదార, బియ్యం, మామిడి చెక్క,  మామిడి ఆకులు, రావి కాండం, బెరడు, తీగ, వేప, గంధం చెక్క , అశ్వగంధ, కొబ్బర కాయలు  తదితర వస్తువులు

శ్రీ రామనవమి పూజ విధానం

శ్రీ రామ నవమి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత రాగి పాత్రలో నీరు అక్షతలు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇంటిలోపలకు  వచ్చి, రాముడి జన్మదినోత్సవం కోసం ఇంటిలోని పూజ గదిలో ఉన్న పీఠాన్ని అలంకరించిన తర్వాత, కలశాన్ని ప్రతిష్టించి, అక్కడ వినాయకుడిని ప్రతిష్టించండి. గణేశుడిని పూజించండి, ఆపై రామయ్యను  పూజించండి. రామయ్యను ఆవాహన చేస్తూ రామయ్యకు పాలు, పెరుగు కలిపి అభిషేకం చేయండి. అభిషేకం తరువాత వివిధ రకాల పుష్పాలతో అలంకరించండి. దుస్తులను కట్టి.. నుదుటిపై తిలకం దిద్దండి.  అనంతరం 108 సార్లు శ్రీ రామ నామాన్ని జపమాలతో జపించండి. ఆ తర్వాత హారతి ఇవ్వండి. ఇలా ఆచార నియమాలతో పూజ చేస్తే పూజ పూర్తయినట్లు భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు