Rama Ayodhya OTT: శ్రీరామనవమి స్పెషల్.. అయోధ్య రామ మందిరంపై తెలుగు వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రామ అయోధ్య వెబ్ సిరీస్ లో బాల రాముడి మందిరంతో పాటు నంది గ్రామం, మహారాజ ప్యాలెస్, భరతుడి తపోవనం, కనక భవన్, దశరథ్ మహల్, దశరథ్ సమాధి, మణి పర్వత్, భరత కూపం తదితర అయోధ్యలో కొలువై ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు, వాటి విశేషాలను ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.
శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య రామజన్మభూమి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలిసారిగా జరుగుతున్న వేడుకలు కావడంతో దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు తరలిరావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా రామ అయోధ్య అనే ఒక సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో ఈ డాక్యుమెంటరీ సిరీస్ ను చిత్రీ కరించారు. నేషనల్ ఫిల్మ్ అవార్డు గ్రహీత సత్యకాశీ భార్గవ రామ అయోధ్య సిరీస్ కు స్టోరీ అందించగా.. కృష్ణ దర్శకత్వం వహించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ శ్రీరామనవమి కానుకగా ఏప్రిల్ 17న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా.
రామ అయోధ్య వెబ్ సిరీస్ లో బాల రాముడి మందిరంతో పాటు నంది గ్రామం, మహారాజ ప్యాలెస్, భరతుడి తపోవనం, కనక భవన్, దశరథ్ మహల్, దశరథ్ సమాధి, మణి పర్వత్, భరత కూపం తదితర అయోధ్యలో కొలువై ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు, వాటి విశేషాలను ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. ‘ అయోధ్య అంటే కేవలం రామ మందిరం మాత్రమే కాదు. అక్కడ ఎన్నో చారిత్రాత్మక, పవిత్ర ప్రదేశాలు, మందిరాలు ఉన్నాయి. అవన్నీ మా డాక్యుమెంటరీలో చాలా చక్కగా చూపించాం. అలాగే శ్రీరాముడి గుణ గణాలను ప్రస్తుత కాలంలో ఆచరించం ఎలాగో సింపుల్ గా అందరికీ అర్థమయ్యేలా ఈ డాక్యుమెంటరీలో వివరించాం’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
ఆహాలో స్ట్రీమింగ్..
Discover the captivating journey of Rama Ayodhya 🙌, a remarkable series unveiling the unparalleled qualities of Rama! 🌟
#RamaAyodhya Premiering exclusively on aha this April 17th! pic.twitter.com/6cpSwox4KX
— ahavideoin (@ahavideoIN) April 15, 2024
మీ ఇంటికే అయోధ్య రామయ్య
Sensational music director of #HanuMan movie and more, @GowrahariK garu, shares insights on Sri Rama and encourages watching the #RamaAyodhya documentary Film premiering on @ahavideoIN on 17th 🙏 @SatyakashiB @KrishnaSRam #HariGowra #HanumanMovie #MusicDirector #SJMediaspot pic.twitter.com/TusqOqlNZz
— Jagadeeshpatel (@Jagadeeshtrsv) April 14, 2024
ఏప్రిల్ 17న స్ట్రీమింగ్..
‘బాల’ సుందరం, శ్రీ’రామ’ మందిరం!🏹 ఈ శ్రీరామనవమికి, అయోధ్య రామయ్య మీ ఇంటికి..🙏 @SatyakashiB @kbaravi @krishnaSRam pic.twitter.com/UPjNgiTvku
— ahavideoin (@ahavideoIN) April 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.