శక్తి స్వరూపిణి దుర్గాదేవిలోని ఈ ఐదు విషయాలను ప్రతి భార్య లేదా స్త్రీ నేర్చుకోవాలి..

హిందూ ధర్మంలో స్త్రీ కుటుంబ జీవితంలో అడుగు పెట్టె ముందు అమ్మవారికి సంబంధించిన కథనాలను, విషయాలను పెద్దలు బోధిస్తారు. ఇలా చేయడానికి కారణం బహుశా దేవత అయిన దుర్గదేవి శత్రు సమాహారం మాత్రమే కాదు ప్రేమ, దయ, కరుణ కలిగిన దైవం.. మరి మానవ మాత్రులమైన మనం దుర్గాదేవిని ఆదర్శంగా స్త్రీలు ఏదైనా కష్ట, నష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి భార్య లేదా ఏ స్త్రీ అయినా తన జీవితంలో కుటుంబ సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

శక్తి స్వరూపిణి దుర్గాదేవిలోని ఈ ఐదు విషయాలను ప్రతి భార్య లేదా స్త్రీ నేర్చుకోవాలి..
Goddess Durga Devi
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2024 | 7:49 PM

హిందూ సనాతన ధర్మంలో దేవుళ్లను మాత్రమే కాదు దేవతలను కూడ పూజించే సాంప్రదాయం ఉంది. విష్ణువు తన హృదయంలో భార్య లక్ష్మీదేవికి భాగమిచ్చినా.. శివయ్య తన శరీరంలో పార్వతికి అర్ధం భాగం ఇచ్చినా ప్రకృతిలో స్త్రీ పురుషులు సమానమే అని చెప్పడానికి.. శక్తి స్వరూపిణిగా జగన్మాతను వివిధ రూపాల్లో పూజిస్తాం. అలాంటి అమ్మవారి అవతారాల్లో అత్యంత ప్రసిద్ధ రూపం దుర్గాదేవి. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మను ప్రేమను పంచె దైవంగానే కాదు.. ప్రతి సమస్యనూ దూరం చేసే తల్లి, శక్తి  స్వరూపిణిగా మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అయితే హిందూ ధర్మంలో స్త్రీ కుటుంబ జీవితంలో అడుగు పెట్టె ముందు అమ్మవారికి సంబంధించిన కథనాలను, విషయాలను పెద్దలు బోధిస్తారు. ఇలా చేయడానికి కారణం బహుశా దేవత అయిన దుర్గదేవి శత్రు సమాహారం మాత్రమే కాదు ప్రేమ, దయ, కరుణ కలిగిన దైవం.. మరి మానవ మాత్రులమైన మనం దుర్గాదేవిని ఆదర్శంగా స్త్రీలు ఏదైనా కష్ట, నష్టాలు వచ్చినా ఎదుర్కోవాలని సూచిస్తారు. ఈ నేపథ్యంలో ప్రతి భార్య లేదా ఏ స్త్రీ అయినా తన జీవితంలో కుటుంబ సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే దుర్గాదేవి నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. ధ్యాన భంగిమలో నిమగ్నమై, విశ్వంలోని ప్రతి మూలలో జరిగే సంఘటనలను వీక్షించే పరమశివునితో పార్వతి తల్లికి ఉన్న సంబంధం మనకు సహనాన్ని నేర్పుతుంది. మనం దానిని వేరే కోణం నుంచి చూస్తే  శివ పార్వతిల మధ్య ఉన్న సంబంధంలో సహనం, శాంతి పునాదిగా చేసుకుని అర్ధనారీశ్వరతత్వాన్ని భోధిస్తున్నట్లు స్పష్టమవుతుంది.
  2. భార్యాభర్తల సంబంధం ఎలా ఉన్నా అది ఎక్కువ కాలం కొనసాగాలంటే ఓపిక పట్టడం చాలా ముఖ్యం. ఒక స్త్రీ తన వ్యక్తిత్వంలో ఈ గుణాన్ని ఒక భాగంగా చేసుకుంటే.. కష్ట సమయం వచ్చినా ఆమె ధైర్యం కోల్పోదు.
  3. ఇతరులను గౌరవించండి. అయితే ఆత్మగౌరవం దెబ్బతినే సమయంలో దేని కోసం రాజీపడకండి. ఇతరులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ధోరణి మహిళల్లో సాధారణం. అయితే ఈ గుణం స్త్రీ జీవితంలోకి దుఃఖం ప్రవేశించేందుకు ద్వారంలా పనిచేస్తుంది.
  4. ఆత్మగౌరవంతో జీవించే వారిని ఇతరులు బలహీనంగా భావించి అన్ని విధాలుగా బాధపెడతారు. అయితే ఇష్టమైన వ్యక్తులను మాత్రమే కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరినీ గౌరవించండి.. అయితే అది మీ గౌరవానికి భాగం కలిగేలా మాత్రం ఉండకూడదు. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టడానికి ప్రయత్నిస్తే.. వారిని  ఎదుర్కోవటానికి వెనుకాడకండి.
  5. దుర్గాదేవి ప్రతి ఒక్కరికీ నిర్భయంగా ఉండమని బోధిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనసులో ఉన్న భయాన్ని తొలగించి ఆ పరిస్థితిని ఎదుర్కోండి. భర్త, పిల్లలు, ఇతర బంధువులు లేదా బయటి వ్యక్తి ఎవరైనా సరే మిమ్మల్ని కించపరిచే ప్రవర్తనను సహించవద్దు. నువ్వే తల్లివి.. నువ్వు గొప్ప శక్తివి అని మర్చిపోకు.
  6. దుర్గదేవి శక్తి రూపం మాత్రమే కాదు.. అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దయ, ఆప్యాయతకు సంబంధించిన అనేక కథలు కూడా ఉన్నాయి. ఈ రెండు భావాలు స్త్రీలకు బలహీనతలు కాదు బలాలు. స్త్రీలు అనుభవించే విధంగా పురుషులు ఈ రెండు భావోద్వేగాలను అనుభవించలేరు. వ్యక్తపరచలేరు.
  7. దుర్గాదేవి శత్రు సంహారం చేసే సమయంలో కూడా ఆమె హృదయంలో అనురాగ భావన ఎల్లప్పుడూ ఉంటుంది. స్త్రీ భావోద్వేగ శక్తులలో ఒకటి ఆప్యాయత. ఈ అనుభూతిని స్త్రీకి పర్యాయపదంగా చూడడానికి ఇదే కారణం. పరిస్థితులు ఎలా ఉన్నా స్త్రీలు ప్రేమను హృదయం నుంచి వేరు చేయవద్దు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!