క్యాన్సర్ స్టేజ్ 4 ప్రాణకోసం పోరాడుతున్న మహిళ.. సెలవులు లేవు విధులకు రమ్మనమని బాస్ ఒత్తిడి..
ప్రపంచంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వడమే కాదు తమ ఉద్యోగస్తులకు మంచి సదుపాయాలను, అవసరం అయితే సెలవులు కూడా ఇస్తున్నాయి. అదే సమయంలో తమ ఉద్యోగస్తులు అస్వస్థతకు గురైనా సరే సెలవులు ఇవ్వని బాస్ లు, కొన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే తమ ఉద్యోగి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే అతడిని కంపెనీకి వచ్చి పని చేయమని ఏ బాస్ అయినా అడగగలరా .. ఇది ఒక్కసారి ఊహించుకోండి. పని చేయడాకి లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు.. కానీ క్యాన్సర్ బాధితురాలు మహిళకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ప్రపంచంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వడమే కాదు తమ ఉద్యోగస్తులకు మంచి సదుపాయాలను, అవసరం అయితే సెలవులు కూడా ఇస్తున్నాయి. అదే సమయంలో తమ ఉద్యోగస్తులు అస్వస్థతకు గురైనా సరే సెలవులు ఇవ్వని బాస్ లు, కొన్ని కంపెనీలు ఉన్నాయి. అయితే తమ ఉద్యోగి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే అతడిని కంపెనీకి వచ్చి పని చేయమని ఏ బాస్ అయినా అడగగలరా .. ఇది ఒక్కసారి ఊహించుకోండి. పని చేయడాకి లేదా మరేదైనా కారణం అయి ఉండవచ్చు.. కానీ క్యాన్సర్ బాధితురాలు మహిళకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. హృదయ విదారకరమైన, సున్నితమైన వార్త వింటే ఎవరికైనా కోపం కన్నీరు వస్తుంది..
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని యజమాని తిరిగి పనిలోకి రమ్మని ఒత్తిడి ఎలా చేస్తున్నాడో చూడండి అంటూ ఒక మహిళ సోషల్ మీడియా వేదికగా చెప్పింది. @disneydoll96 అనే ID ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. దీనిలో ఓ కాలేజీ విద్యార్థిని తన 50 ఏళ్ల తల్లి గత 18 నెలలుగా స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు వెల్లడించింది. తన తల్లి పని చేస్తున్న కంపెనీ బాస్‌కి కూడా తన తల్లి పరిస్థితి గురించి తెలుసు.. అయినా సరే ఆ యజమాని తన తల్లిని ఆఫీసుకు రమ్మని అడుగుతూనే ఉన్నాడు.
పోస్ట్‌లో బాస్ పంపిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది. అందులో ‘మీరు చితిత్స తీసుకుంటున్న ఆంకాలజిస్ట్ నుంచి మీరు పనికి తిరిగి రావడానికి సరిపోతారనే ఒక లెటర్ ను తీసుకోండి. మీటింగ్‌కి రమ్మని బాస్ కూడా మెయిల్‌లో చేశాడు. అనే స్క్రీన్ షాట్ షేర్ చేసిన కూతురు.. ఇంకా తన తల్లి అసలు మీటింగ్ కు రాగలదా లేదా అని బాస్ ఆలోచించలేదు.. మీటింగ్‌కు రావాలని నేరుగా ఆదేశించాడని చెబుతోంది.
My Mum has stage 4 cancer in 5 areas and her boss has been pressuring her to come back to work. byu/disneydoll96 inmildlyinfuriating
తన తల్లి ఐర్లాండ్‌లోని ఓ షాప్ లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తోందని.. అయితే ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకుని తన తల్లి ఏదో ఒక రోజు పనిలోకి వెళ్తుందని తాను ఆశిస్తున్నానని బాలిక తెలిపింది. తండ్రిని కోల్పోయిన తర్వాత మంచి ఉద్యోగం దొరకలేదని.. తాను డిగ్రీ పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నానని ఆ బాలిక చెబుతోంది.
ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాల కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఒకరు ‘కొంతమంది చాలా చెత్తగా ఉన్నారు’ అని వ్రాశారు, మరొకరు మీ తల్లి బాస్ కు క్యాన్సర్ ఉందని నేను చెప్పను.. అయితే అతనిలో ఏదో చెడు సంకల్పం ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..