అరటి పువ్వు చేసే అద్భుతం తెలుసా..? వారానికోసారి తిన్నా చాలు.. శరీరంలో మ్యాజిక్ చూస్తారు..

ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు అరటి పువ్వును క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తకొరత నివారిస్తుంది. అరటి పువ్వులో ఉండే, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లతో పోరాడుతుంది. అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

అరటి పువ్వు చేసే అద్భుతం తెలుసా..? వారానికోసారి తిన్నా చాలు.. శరీరంలో మ్యాజిక్ చూస్తారు..
Banana Flower
Follow us

|

Updated on: Apr 15, 2024 | 12:12 PM

అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. అయితే, అరటి పువ్వు తింటే కలిగే లాభాలు మీకు తెలుసా.? ముఖ్యంగా మగవారిలో ఎదురయ్యే 7 ప్రధాన సమస్యలకు అరటి పువ్వు అద్భుత సంజీవనిగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వులో ఫైబర్‌, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఇ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ కారణంగానే అరటి పువ్వు అనేక వ్యాధులతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. అరటి పువ్వు ప్రయోజనాలు తెలియనక విస్మరిస్తున్న వారంతా .. ఈ లాభాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అరటి పువ్వును వంటలో ఉపయోగిస్తారు.

అరటి పువ్వు మధుమేహులకు మంచిది. అరటి పువ్వుతో బ్లడ్‌ షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది నెమ్మదిగా శరీరంలోకి గ్లూకోజ్‌ని విడుదల చేస్తుంది. అదనంగా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. అరటి పువ్వు నెఫ్రో ప్రొటెక్టివ్ యాక్టివిటీని కలిగి ఉంది. అరటి పువ్వు అధిక రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. ఇది యాంటీ హైపర్‌టెన్సివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించగలదు. అరటి పువ్వులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ అనేక ఇతర వ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇది కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుతుంది. అరటి పువ్వులలో ఉండే పీచు మూత్రపిండాల్లో రాళ్లతో పోరాడుతుంది. అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రోస్టేట్ గ్రంధి పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

అరటి పువ్వులో ఎముకలను బలోపేతం చేసే అంశాలు ఉంటాయి. ఇందులో ఉండే జింక్ ఎముకల నష్టాన్ని నివారిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. అరటి పువ్వులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడేవారు అరటి పువ్వును క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తకొరత నివారిస్తుంది. అరటి పువ్వులో ఉండే, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles