AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Side Effects: వామ్మో..! పాలే కదా అని ఎక్కువగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

పాలు సంపూర్ణ ఆహారం అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ రోజూ ఒక గ్లాస్‌ పాలు తాగాలని వైద్యులు చెబుతుంటారు. పాలతో ఎముకలకు కావాల్సిన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పాటుగా విటమిన్ డి, బి కాంప్లెక్స్, ప్రోటీన్ కూడా పాలతో లభిస్తుంది. రోజూ పాలు తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రాత్రి నిద్రకు ముందు..ఓ గ్లాస్‌ పాలు తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంది. అందుకే పిల్లలు సహా పెద్దలు కూడా రోజూ రాత్రి పడుకునే ముందు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగాలని చెబుతుంటారు. అలాంటి పాలు అతిగా తాగితే ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎదుర్కొవాల్సి వస్తుందో తెలుసా..? పాలు ఎక్కువగా తాగటం వల్ల ప్రయోజనాలకు బదులు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 15, 2024 | 12:40 PM

Share
ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసే పాలు అతిగా తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. పాలు ఎక్కువగా తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెబుతున్నారు.. శరీరంలో తిమ్మిరి, ఉబ్బరం, అజీర్ణం, అతిసారం వంటి సమస్యలు ఎదురవుతాయని సూచిస్తున్నారు. శరీరం లాక్టోస్‌ను సరిగ్గా విచ్ఛిన్నం చేయలేకపోతే, అది జీర్ణవ్యవస్థ గుండా వెళుతుంది.  గట్ బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమవుతుంది. ఇది గ్యాస్ ఏర్పడటానికి, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

1 / 5
ఎక్కువ పాలు తానివారిలో మీ శరీరం పాలకు అనుగుణంగా లేకుంటే అది పేగు సిండ్రోమ్‌కు దారి తీస్తుంది.  దీని కారణంగా మీరు ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా ఉంటారు. ఎక్కువగా తలనొప్పి సమస్య కూడా వేధించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
పాలు ఎక్కువగా తాగటం వల్ల ముఖంపై మొటిమల సమస్య కూడా పెరుగుతుంది. మొటిమలు, మచ్చలతో  బాధపడాల్సి ఉంటుంది.. ముఖంపై మొటిమలు, మచ్చలు తరచూ వేధిస్తున్నట్టయితే.. మీరు రోజుకు ఎన్ని పాలు తాగుతున్నారో గమనించండి. పాలలోని కొన్ని రసాయనాలు బ్రేక్అవుట్ సమస్యలను కలిగిస్తాయి.

3 / 5
పాలలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే.. పాలను నివారించాలి.. లేదా చాలా తక్కువగా తీసుకోవాలి. లేదంటే పాలు ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. ఎరుపు రంగులో పగుళ్లు, దద్దుర్ల ఉన్నట్లైతే పాలు ఎక్కువగా తీసుకుంటున్నట్లు గుర్తు. ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్‌ చేస్తే.. ఈ లక్షణాలు ఇంకా తీవ్రమవుతాయి.

4 / 5
పాలు ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. పాలు ఐరన్‌ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. మీకు రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే, ప్రతిరోజూ 3 కప్పుల పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.  కల్తీ లేని తాజా పాలను తాగటం మంచిదని చెబుతున్నారు.

5 / 5