- Telugu News Photo Gallery Child Constipation: How To Relieve Constipation In Toddler And Infants Naturally
Child Constipation: కారణం లేకుండానే పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారా? ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
బుజ్జాయిలు 6 నెలల తర్వాత తల్లి పాలతోపాటు ఘన ఆహారం కూడా తింటుంటారు. అప్పటి వరకు తల్లి పాలను ఆహారంగా తీసుకునే వారి శరీరం ఘనాహారం తీసుకోవడానికి త్వరగా అలవాటు పడదు. అందుకే తేలికగా జీర్ణం అయ్యే బియ్యం-ధాన్యం నీరు, రొయ్యలు, చేపల పులుసు, అరటిపండ్లు వంటి తేలికపాటి ఆహారాలను శిశువుకు అందిస్తారు. బియ్యాన్ని మిక్సీలో పొడిగా రుబ్బుకుని ఆహారం తయారు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కొత్త ఆహారానికి అనుగుణంగా మారడానికి..
Updated on: Apr 15, 2024 | 12:57 PM

బుజ్జాయిలు 6 నెలల తర్వాత తల్లి పాలతోపాటు ఘన ఆహారం కూడా తింటుంటారు. అప్పటి వరకు తల్లి పాలను ఆహారంగా తీసుకునే వారి శరీరం ఘనాహారం తీసుకోవడానికి త్వరగా అలవాటు పడదు. అందుకే తేలికగా జీర్ణం అయ్యే బియ్యం-ధాన్యం నీరు, రొయ్యలు, చేపల పులుసు, అరటిపండ్లు వంటి తేలికపాటి ఆహారాలను శిశువుకు అందిస్తారు.

బియ్యాన్ని మిక్సీలో పొడిగా రుబ్బుకుని ఆహారం తయారు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కొత్త ఆహారానికి అనుగుణంగా మారడానికి సమయం పడుతుంది. లేదంటే పిల్లల్లో మలబద్ధకం ప్రారంభమవుతుంది. అంటే మల విసర్జనకు ఇబ్బంది తలెత్తడం వల్ల కడుపునొప్పి వచ్చి పిల్లలు ఏడుస్తుంటారు. ముఖ్యంగా నేటి కాలంలో రెండు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మలబద్ధకం చాలా సాధారణ సమస్యగా మారుతుంది. సాధారణంగా ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పిల్లలు అన్నం నేరుగా తినలేరు. అందువల్ల అన్న కాస్త మెత్తగా చేసి తినిపిస్తారు. 8 నెలల పసిపాప అయినా, 2న్నరేళ్ల చిన్నారి అయినా.. పిల్లల్లో మలబద్ధకం సమస్యను ఎలా తొలగించాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి.

ఏడాది కంటే తక్కువ వయస్సు పిల్లల ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో శిశువు ఘనాహారాన్ని తినడం నేర్చుకుంటుంది. దీంతో శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. అయితే మలబద్ధకం కలిగించే ఆహారాన్ని మాత్రం పిల్లలకు తినిపించకూడదు.

ముఖ్యంగా శిశువుల ఆహారంలో పిండి పదార్ధాలను చేర్చకూడదు. పచ్చి బఠాణీలు, బంగాళదుంపలు వంటి ఆహారాన్ని ఇవ్వకపోవడమే మంచిది. బదులుగా బత్తాయి, ఉడకబెట్టిన యాపిల్, ఓట్ మీల్ మొదలైనవి శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 1 నుండి 3 సంవత్సరాల వయస్సు గల పసిపిల్లలలో 90% మలబద్ధకం సమస్యలకు జీవనశైలి ప్రధాన కారణం. చిన్నప్పటి నుంచి సరైన ఆహారపు అలవాట్లు ఏర్పడకపోతే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ మలబద్ధకం సమస్య పెరుగుతుంది.

ప్రస్తుత కాలంలో పిల్లల్లో చిన్నప్పటి నుంచే జంక్ ఫుడ్ అలవాట్లు పెరుగుతున్నాయి. ఇది వారి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లల ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఉంచాలి. ఈ వయస్సులో వారు ఘన ఆహారాన్ని తినడం నేర్చుకుంటారు కాబట్టి.. ఓట్స్, డాలియాస్ నుంచి అన్ని రకాల కూరగాయలు, పండ్లను వారికి తినిపించాలి. అన్నంతో పాటు బ్రెడ్ కూడా తినిపించవచ్చు.




