Thyroid Problem: అందుకే థైరాయిడ్‌తో బాధపడేవారు బరువు పెరుగుతారు.. ఈ తప్పులు చేశారో అంతేసంగతులు

థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. మీరూ హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నట్లయితే త్వరలోనే బరువు పెరుగుతారు. మరైతే ఎలా? బరువును ఎలా అదుపులో పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారా? కొన్ని జీవనశైలి మార్పులతో హైపర్ థైరాయిడిజంలో కూడా బరువు తగ్గడం సాధ్యమేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..

Srilakshmi C

|

Updated on: Apr 15, 2024 | 1:19 PM

థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. మీరూ హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నట్లయితే త్వరలోనే బరువు పెరుగుతారు. మరైతే ఎలా? బరువును ఎలా అదుపులో పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారా? కొన్ని జీవనశైలి మార్పులతో హైపర్ థైరాయిడిజంలో కూడా బరువు తగ్గడం సాధ్యమేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
నిజానికి థైరాయిడ్ గ్రంధి శరీర జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అందువల్ల హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నప్పుడు బరువును నియంత్రించడం కష్టమవుతుంది. థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు రోజూ వైద్యులు సూచించిన మెడిసిన్‌ తీసుకోవాల్సిందే. ఇది థైరాయిడ్ హార్మోన్ స్రావం, పనితీరును సక్రియం చేస్తుంది. అయితే బరువు అదుపులో ఉండాలంటే కొన్ని పద్ధతులను అనుసరించాలి. అవేంటంటే..

2 / 5
థైరాయిడ్ మెడిసిన్‌ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అయితే మెడిసిన్ తీసుకున్న తర్వాత బ్రేక్ ఫాస్ట్ మానేయడం సరికాదు. దాంతో బరువు పెరుగుతుంది. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు. ఒకేసారి పెద్ద మొత్తంలో తినకూడదు. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినాలి.

3 / 5
థైరాయిడ్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఫుడ్స్ మానుకోవాలి. ఇవి బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. సోడా పానీయాలలో చక్కెర, కేలరీలు రెండూ ఎక్కువగా ఉంటాయి. అందుకే వేసవిలో శరీరాన్ని చల్లగా కాపాడుకునేందుకు కూల్‌ డ్రింక్స్‌ను ఎంచుకోకండి. ఇవి బరువు పెంచుతాయి. థైరాయిడ్‌తో పాటు ఇతర వ్యాధులు కూడా రావచ్చు.

4 / 5
అలాగే థైరాయిడ్ రోగులకు వ్యాయామం చాలా ముఖ్యం. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే జీవక్రియ రేటు సాధారణం చేస్తుంది. నిద్రలేమి వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక థైరాయిడ్‌లో బరువు పెరగకుండా నియంత్రిచాలంలే రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత నిద్ర అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 5
Follow us