- Telugu News Photo Gallery Mind Blowing Health benefits of Galia Watermelon, check here is details in Telugu
Galia Watermelon: ఈ హైబ్రిడ్ వాటర్ మిలెన్ తింటే.. కావాల్సినన్ని పోషకాలన్నీ అందుతాయ్!
పుచ్చకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేసవి వచ్చిందంటే చాలు.. పుచ్చకాయలు ఇంట్లో ఉండాల్సిందే. ఇది తియ్యగా, సాఫ్టీగా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పుచ్చకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ గలియా వాటర్ మిలెన్ కూడా ఒకటి. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ గలియా పుచ్చకాయలో.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. దీన్ని పోషకాహార నిపుణులు 'సూపర్ ఫుడ్'గా అభివర్ణించారు. ఈ హైడ్రిబ్ పుచ్చకాయ తేనెలాగ..
Updated on: Apr 15, 2024 | 1:46 PM

పుచ్చకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వేసవి వచ్చిందంటే చాలు.. పుచ్చకాయలు ఇంట్లో ఉండాల్సిందే. ఇది తియ్యగా, సాఫ్టీగా ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పుచ్చకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఈ గలియా వాటర్ మిలెన్ కూడా ఒకటి.

ఇజ్రాయెల్‌కు చెందిన ఈ గలియా పుచ్చకాయలో.. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. దీన్ని పోషకాహార నిపుణులు 'సూపర్ ఫుడ్'గా అభివర్ణించారు. ఈ హైడ్రిబ్ పుచ్చకాయ తేనెలాగ తియ్యగా ఉంటుంది. సువాసన కూడా అలాగే ఉంటుంది.

ఈ పుచ్చకాయలో పోషకాలు అనేవి సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువ కేలరీలు ఉంటాయి. ఈ పుచ్చకాయ తింటే తక్షణమే శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ లెవల్స్ కూడా పెరుగుతాయి. జీర్ణ క్రియను కూడా మెరుగు పరుస్తుంది.

ఈ పుచ్చకాయ తింటే.. కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్నవారు ఎలాంటి డౌట్ లేకుండా ఈ పుచ్చకాయను తినొచ్చు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.

ఈ పుచ్చకాయ తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, చికాకు అనేవి తగ్గుతాయి. అంతే కాకుండా శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ గలియా మెలోన్ తింటే మంచి ఫలితం ఉంటుంది.




