- Telugu News Photo Gallery High Protein Diet: Eat This Two High Protein Dal For Weight Loss, Check Details Here
High Protein Diet: ఒంట్లో కొవ్వు వెన్నలా కరిగిపోవాలంటే.. ఈ 2 రకాల పప్పులు తప్పక తినాల్సిందే!
బరువు పెరిగినంత తేలికగా బరువు తగ్గడం సాధ్యం కాదు. అందుకు చాలా కసరత్తు అవసరం. చాలా మంది జిబ్‌లలో వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ కష్టపడకుండానే సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఈ కింది డైట్ ఫాలో అయితే సరిపోతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన ప్రోటీన్ కూడా అవసరం. అధిక ప్రొటీన్ కోసం చాలా మంది మంసాహారాన్ని ఎంచుకుంటారు. కానీ జంతు ప్రోటీన్ కంటే కూరగాయల ప్రోటీన్..
Updated on: Apr 15, 2024 | 12:45 PM

బరువు పెరిగినంత తేలికగా బరువు తగ్గడం సాధ్యం కాదు. అందుకు చాలా కసరత్తు అవసరం. చాలా మంది జిబ్‌లలో వ్యాయామం చేస్తూ ఉంటారు. కానీ కష్టపడకుండానే సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు ఈ కింది డైట్ ఫాలో అయితే సరిపోతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి తగిన ప్రోటీన్ కూడా అవసరం. అధిక ప్రొటీన్ కోసం చాలా మంది మంసాహారాన్ని ఎంచుకుంటారు. కానీ జంతు ప్రోటీన్ కంటే కూరగాయల ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మాంసంలో ఉండే ప్రోటీన్ కంటే వివిధ పప్పులలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. శాఖాహారం తినడానికి ఇష్టపడే వారికి ప్రోటీన్ అధికంగా పప్పుదినుసులు ఎంతో ఉపయోగపడతాయి.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. అధిక ప్రోటీన్ కలిగిన పప్పులు బరువు తగ్గడంలో సహాయపడతాయి. పప్పులో ప్రొటీన్లు అధికంగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. పప్పులలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీంతో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బరువు తగ్గడానికి ఆహారంలో ఏయే పప్పులు చేర్చుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

పెసర పప్పులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, ఫైబర్, ఫోలేట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆకు కూరలలో పప్పును కలిపి కూరలు చేయవచ్చు. ఇందులో కొవ్వు శాతం తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్లైసెమిక్ నియంత్రణలోనూ సహాయపడుతుంది.

అలాగే కందిపప్పు కూడా తీసుకోవచ్చు. ఈ పప్పుల్లో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయి. ఫలితంగా బరువు సులభంగా తగ్గుతుంది.




