Hyderabad: కరోనాను ఎదుర్కోనేందుకు బల్దియా కార్మికులకు మరింత బలం.. మేయర్ విజయలక్ష్మి ఆధర్వ్యంలో..
Hyderabad: కరోనా వైరస్ కట్టడికై నిరంతరం శ్రమిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఇమ్యూనిటీ..
Hyderabad: కరోనా వైరస్ కట్టడికై నిరంతరం శ్రమిస్తూ ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులకు ప్రత్యేకంగా ఇమ్యూనిటీ మెడికల్ కిట్‌లను పంపిణీ చేశారు. నగర మేయర్ విజయ లక్ష్మి. సోమవారం నాడు గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ దాదాపు ఐదు వందల మంది కార్మికులకు ఇమ్యూనిటీ బూస్టర్ కిట్లు అందజేశారు. కాగా, ఈ కిట్లను ప్రాజెక్ట్ హోప్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో అందజేశారు. కార్మికులకు అందజేసిన ఇమ్యూనిటీ మెడికల్ కిట్లలో మల్టీ విటమిన్ టాబ్లెట్‌లు , డీ.విటమిన్ టాబిలెట్లు, జింక్ టాబ్లెట్లు, పారాసిటమాల్, హ్యాండ్ శానిటైసర్, హ్యాండ్ గ్లౌస్‌లు, మాస్కులు ఉన్నాయి. ఈ కిట్ల పంపిణీ సందర్భంగా మేయర్ విజయ లక్ష్మి మాట్లాడారు.
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే, దాదాపు 95 శాతం శానిటేషన్ సిబ్బందికి వాక్సినేషన్ పూర్తిచేశామని అన్నారు. ఇమ్యూనిటీ కిట్ల పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోష్ బాదావత్, సిఎంహెచ్‌ఓ అరుణ, హోప్ ప్రాజెక్ట్ ప్రతినిధులు సామ్యూల్ పట్టా, మెర్లిన్, స్టీవెన్, సద్గుణ బాబు, తదితరులు పాల్గొన్నారు.
Also read: