Lockdown Effect: మరో 24 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలు తెలుసుకోండి
South Central Railway: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో
South Central Railway: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే మరో 27 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గడంతో పలు మార్గాల్లో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రకటించింది. ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది. తాజాగా రద్దయిన రైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా.. 1. గూడూరు-విజయవాడ 2. విజయవాడ-గూడూరు 3. గుంటూరు-వికారాబాద్ 4. వికారాబాద్-గుంటూరు 5. విజయవాడ-సికింద్రాబాద్ 6. సికింద్రాబాద్-విజయవాడ 7. బీదర్-హైదరాబాద్ 8. సికింద్రాబాద్-బీదర్ 9. హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ 10. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ 11. సికింద్రాబాద్-కర్నూల్ సిటీ 12. కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ 13. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ 14. సిర్పూర్ కాగజ్ నగర్ -సికింద్రాబాద్ 15. నర్సాపూర్-నిడుదవోలు 16. నిడుదవోలు-నర్సాపూర్ 17. గుంటూరు-కాచిగూడ 18. కాచిగూడ-గుంటూరు 19. ఆదిలాబాద్-హెచ్.ఎస్.నాందేడ్ 20. హెచ్.ఎస్.నాందేడ్-ఆదిలాబాద్ 21. పర్బని-హెచ్.ఎస్.నాందేడ్ 22. ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్-తిరుపతి 23. విజయవాడ-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్ 24. తిరుపతి-ఎం.జీ.ఆర్.చెన్నయ్ సెంట్రల్ మధ్య నడిచే రైళ్లను జూన్ 1నుంచి 16 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది.
Cancellation of Trains@RailMinIndia @drmned @drmgtl pic.twitter.com/57CRE31SdC
— South Central Railway (@SCRailwayIndia) May 30, 2021
Also Read: