Xavier Doherty: ఆర్ధిక ఇబ్బందులతో.. కార్పెంటర్‌గా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌.. వీడియో

Australian cricketer Xavier Doherty: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా మన దేశంలో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ కారణంగా చాలామంది స్వదేశీ, విదేశీ కొత్త క్రికెటర్లు

Xavier Doherty: ఆర్ధిక ఇబ్బందులతో.. కార్పెంటర్‌గా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌.. వీడియో
Australian Cricketer Xavier Doherty
Follow us

|

Updated on: May 31, 2021 | 2:55 PM

Australian cricketer Xavier Doherty: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా మన దేశంలో అయితే ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ కారణంగా చాలామంది స్వదేశీ, విదేశీ కొత్త క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. అలా వచ్చిరాగానే వారు ఒక్క మ్యాచ్‌లో రాణించినా.. వారికి రాత్రికిరాత్రే స్టార్‌డమ్ వచ్చేస్తుంది. వారికి వేలంలో ఫుల్‌ డిమాండ్‌ పెరిగిపోతుంది. ప్రతిభ నిరూపించుకంటే చాలు ఇటు ఫ్రాంచైజీ నుంచి, అటు యాడ్స్ ద్వారా కోట్లకు కోట్లు ఆర్జించే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వాళ్లు కూడా ఈ లీగ్‌లో ఆడుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. కొంతమంది పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆర్ధిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతూ.. జీవనం సాగించలేక సతమతమవుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ క్రికెటర్ కూడా పొట్ట నింపుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాడు. పొట్ట పోషించుకోవడానికి వడ్రంగిగా మారాడు మాజీ క్రికెటర్ జేవియర్ డోహెర్టీ. క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించి నాలుగేళ్లకు పైగా అవుతోంది. 2015 ప్రపంచ కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా జట్టులో డోహెర్టీ భాగస్వామిగా ఉన్నాడు.

లెప్ట్‌ ఆర్మ్ స్పిన్నర్ అయిన జేవియర్ డోహెర్టీ 2001-02 సీజన్లో ఫస్ట్-క్లాస్ జట్టులో అరంగేట్రం చేశాడు. దాదాపు అతను 17 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగాడు. 71 ఫస్ట్ క్లాస్, 176 లిస్ట్ ఏ, 74 టీ-20 మ్యాచ్‌లు ఆడిన అతను.. మొత్తం 415 వికెట్లు పడగొట్టాడు. ఇక డోహెర్టీ చివరిసారిగా 2015లో ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కనిపించాడు. ఈ మాజీ ఆస్ట్రేలియన్‌ లెప్ట్‌ ఆర్మ్ స్పిన్నర్ ఇప్పటిరకు ఆస్ట్రేలియా తరఫున 4 టెస్టులు, 60 వన్డేలు ఆడాడు. కాగా 2020, మార్చిలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సందర్భంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ కోసం చివరిసారిగా ఆడాడు. కాగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం డోహెర్టీ.. ఆర్ధిక ఇబ్బందులతో కార్పెంటర్ పనిని నేర్చుకున్నట్లు వీడియోలో వెల్లడించాడు. ఇప్పటికీ దాదాపు మూడు వంతుల పని వచ్చిందని తెలిపాడు. ఆర్ధిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్న తనకు కొంతమంది సాయం చేశారని పేర్కొన్నాడు. తాజాగా ఈ వీడియోను ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ పంచుకుంది.

వీడియో..

Also Read:

భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో మెరిసిన పూజా రాణి

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రోజే సంచలనాలు.. పోరాడి గెలిచిన నవోమి ఒసాకా