David Warner: ఇంటికి చేరుకున్నామోచ్..! ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు

ఐపీఎల్​లో​ పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ను విజయవంతంగా ముగించుకున్నారు. అంనంతరం వారు

David Warner: ఇంటికి చేరుకున్నామోచ్..! ఆనందంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు
Australia's Ipl Contingent
Follow us
Sanjay Kasula

| Edited By: Team Veegam

Updated on: May 31, 2021 | 5:55 PM

ఐపీఎల్​లో​ పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్​ను విజయవంతంగా ముగించుకున్నారు. అంనంతరం వారు సోమవారం తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత తమ కుటుంబాల్ని కలుసుకున్న ఆనందంలో భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబసభ్యులను కలిసి ఆనందంలో మునిగితేలారు.

ఆ సంతోషాన్ని పలు ఆసీస్​ క్రికెటర్లు సోషల్​మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సన్​రైజర్స్ బ్యాట్స్​మన్​ వార్నర్(David Warner)​ ఇంటికి చేరుకోగానే తన కూతుర్లను హత్తుకుని ఎంతో సంబరపడిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్​మీడియాలో షేర్ చేశాడు.

ఇంటికి రావడం సంతోషంగా ఉంది. ఒక చోట ఇరుక్కుపోవడం ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది అని పేస్​ బౌలర్​ జాసన్​ బెహ్రండార్ఫ్​ అన్నాడు. వీరితోపాటు స్టీవ్​ స్మిత్​(Steve Smith), పాట్​ కమిన్స్(Cummins)​, గ్లెన్​ మాక్స్​వెల్(Glenn Maxwell)​, జే రిచర్డ్​సన్ ఇంకా మరికొందరు ఆటగాళ్లు వారి ఇళ్లకు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి : Croaker Fish: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్