భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మెరిసిన పూజా రాణి
Pooja Rani Gold: ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రింగులోకి దిగన పూజా రాణి(75 కిలోలు) వరుస విజయాలను దక్కించుకుంది. ఆదివారం టోర్నీలో జరిగిన ఫైనల్ పోరులో
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మరో స్వర్ణం గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రింగులోకి దిగన పూజా రాణి(75 కిలోలు) వరుస విజయాలను దక్కించుకుంది. ఆదివారం టోర్నీలో జరిగిన ఫైనల్ పోరులో మావ్లుడా మోవ్లోనోవా(ఉజ్బెకిస్థాన్)పై అద్భుతమైన పంచులు విసిరి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఈ పతకంతో పాటు ఆమెకు రూ.7.23 లక్షల(10వేల డాలర్లు)ను బహుమానంగా అందుకుంది.
అయితే టోర్నీలో తొలిసారి పాల్గొన్న భారత బాక్సర్ లాల్బుయట్సైహి 64 కేజీల విభాగంలో రజతం సాధించింది. ఫైనల్లో మిలాన సాఫ్రనోవా(కజకిస్థాన్)కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ 2-3 తేడాతో ఓటమి చవిచూసింది.
అంతకుముందు ప్రపంచ మాజీ ఛాంపియన్ మేరీ కోమ్ కూడా 51 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.
ఇక బాక్సింగ్ 51 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన కైజాయ్కు 10 వేల డాలర్ల(రూ.7.23 లక్షలు) బహుమానం లభించగా.. రజత పతకం సాధించిన మేరీకోమ్కు 5వేల డాలర్లు లభించింది. నాజీమ్ కైజాయ్ ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా.. ఆరుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది.