ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ తొలి రోజే సంచలనాలు.. పోరాడి గెలిచిన నవోమి ఒసాకా
Naomi Osaka: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రోజే సంచలన విజయం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో జర్మనీకి చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణ...
ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రోజే సంచలన విజయం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో జర్మనీకి చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణ అంజెలిక్ కెర్బర్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు రెండో సీడ్ నవోమి ఒసాకా తొలి రౌండ్‌లో చెమటోడ్చి విజయం సాధించింది. రెండో సీడ్ ఒసాకా తొలి రౌండ్‌లో విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో ఒసాకా 64, 76తో రుమేనియాకు చెందిన పాట్రికా టిగ్‌ను ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా జరిగింది. ప్రత్యర్థి నుంచి ఒసాకాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న ఒసాకా వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
అయితే ప్రపంచ సింగిల్స్‌లో 139వ ర్యాంక్‌లో ఉన్న కలినినా మొదటి రౌండ్‌లో జర్మనీ క్రీడాకారిణి, 26వ సీడ్ కెర్బర్‌పై జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించిన కలినినా 62, 64తో కెర్బర్‌ను చిత్తు చేసి రెండో రౌండ్‌కు చేరుకుంది.
ఇక పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్‌కు చెందిన 11వ సీడ్ బౌటిస్టా అగట్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. ఇతర పోటీల్లో రష్యాకు చెందిన 23వ సీడ్ కరెన్ కచనోవ్, స్పెయిన్‌కు చెందిన 12వ సీడ్ కరెనొ బుస్టా తదితరులు విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.