ఆసుపత్రి నుంచి మిల్కా సింగ్ డిశ్ఛార్జ్.. ఆయన భార్య ఐసీయూకు తరలింపు
Milkha Singh: భారత్ లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ మిల్కా సింగ్ మరోసారి గెలిచారు. కరోనాతో పోరాడి ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం నిలకడగా..

భారత్ లెజెండరీ స్ప్రింటర్ మిల్కా సింగ్ మిల్కా సింగ్ మరోసారి గెలిచారు. కరోనాతో పోరాడి ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు స్పష్టంచేశాయి. అయితే గత వారం రోజుల క్రితం కొవిడ్‌తో ఆసుపత్రిలో మిల్కా సింగ్, ఆయన భార్య ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మాత్రం వేగంగా కోలుకున్నారు. ఆయన ప్రస్తుతం ఆక్సిజన్ సాయంతో ఊపిరితీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేక పోవడంతో ఇంటికి పంపించాము అని వెల్లడించారు.
కుటుంబ సభ్యుల కోరిక మేరకు మిల్కాసింగ్‌ను డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఆక్సిజన్ సపోర్ట్‌తో ఆయన ఉన్నారని వారు పేర్కొన్నారు.
అయితే మిల్కా సింగ్ భార్య నిర్మలా కౌర్‌కు కొంత ఆక్సిజన్ తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే ఆమెను శనివారం ఐసీయూకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా మిల్కా సింగ్ గత సోమవారం, ఆయన భార్య బుధవారం ఒకే ఆసుపత్రిలో చేరారు.
Also read:




