Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పెళ్లి పేరిట నయవంచన.. ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తానంటూ లేడీ డాక్టర్‌కి బెదిరింపులు!

దేశ విదేశాల్లో తన తల్లిదండ్రులకు పెద్దపెద్ద వ్యాపారాలు ఉన్నాయని, తమది చాలా సంపన్న కుటుంబమని నమ్మబలికిన ఓ కేటుగాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వైద్యురాలిని నిండా ముంచాడు. మాయమాటలు చెప్పి రూ.10 లక్షలు వసూలు చేసి.. ఆనక అడిగినంత ఇవ్వకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు..

Hyderabad: పెళ్లి పేరిట నయవంచన.. ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తానంటూ లేడీ డాక్టర్‌కి బెదిరింపులు!
Matrimonial Fraud
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 28, 2025 | 12:08 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 28: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వైద్యురాలిని నిండా ముంచాడో మోసగాడు. మాయమాటలు చెప్పి రూ.10 లక్షలు వసూలు చేసిన కేటుగాడు.. ఆనక అడిగినంత ఇవ్వకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన లేడీ డాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన వైద్యురాలి (31)కి జనవరిలో మ్యాట్రీమోనీ ద్వారా హర్ష చెరుకూరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఫోన్‌ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్న వారు వాట్సాప్‌ చాటింగ్‌ చేసుకుంటున్నారు. దేశ విదేశాల్లో తన తల్లిదండ్రులకు పెద్దపెద్ద వ్యాపారాలు ఉన్నాయని, తమది చాలా సంపన్న కుటుంబమని నమ్మబలికాడు. కొన్ని రోజుల తర్వాత తమ ఆఫీస్‌పై జరిగిన ఐటీ దాడుల వల్ల తన బ్యాంకు ఖాతాను సీజ్‌ చేశారని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. తనకు కొంత డబ్బు సహాయం చేస్తే తర్వాత తిరిగి ఇస్తానని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన లేడీ డాక్టర్‌ పలు దఫాలుగా రూ.10 లక్షలు ఇచ్చింది.

హర్ష తల్లి అమెరికాలో డాక్టర్‌ అని, ఫిబ్రవరి 21న ఆమె అమెరికా నుంచి వస్తున్నదని, పెళ్లి విషయం మాట్లాడుకుందాం అని చెప్పాడు. అయితే తీరా అతడి తల్లి రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు డబ్బు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో తన నిజ స్వరూపాన్ని బయట పెట్టిన హర్ష ఆమెను బెడిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు అడిగితే నీ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. ఫొటోలు వైరల్‌ కాకుండా ఉండాలంటే మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్ష బ్యాంకు ఖాతాను స్తంబింపచేశారు. అతడి కోసం పోలీసు బృందాలు గాలింపు ప్రారంభించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.