AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2025 Topper: జేఈఈ మెయిన్‌ పేపర్ 2 టాపర్‌ రక్షా సక్సెస్ సీక్రెట్‌ ఇదే.. ప్రిపరేషన్‌ స్ట్రాటజీ వెల్లడి

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్‌) పేపర్‌ 2 పరీక్ష ఫలితాల్లో కర్ణాటక అమ్మాయి రక్షా దినేష్ హెగ్డే ఆల్‌ ఇండియా 5వ ర్యాంక్‌ సాధించింది. 99.986 పర్సంటైల్‌తో కర్ణాటక రాష్ట్ర టాపర్‌గా నిలిచిన రక్షా .. గణితంలో 99.54 పర్సంటైల్, ఆప్టిట్యూడ్ 99.92 పర్సంటైల్, డ్రాయింగ్ 77.13 పర్సంటైల్ చొప్పున సాధించింది. తన విజయానికి తాన కోచింగ్ సెంటర్ ఇచ్చిన ప్రిపరేషన్ చిట్కాలే కారణం అంటోంది..

JEE Main 2025 Topper: జేఈఈ మెయిన్‌ పేపర్ 2 టాపర్‌ రక్షా సక్సెస్ సీక్రెట్‌ ఇదే.. ప్రిపరేషన్‌ స్ట్రాటజీ వెల్లడి
JEE Main 2025 Topper
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2025 | 8:17 AM

2025-26 విద్యా సంవత్సరానికి బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30న నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్‌) పేపర్‌ 2 పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. తాజా జేఈఈ మెయిన్‌ సెషన్ 1 పేపర్‌ 2 ఫలితాల్లో కర్ణాటక అమ్మాయి రక్షా దినేష్ హెగ్డే.. 99.986 పర్సంటైల్‌తో ఆల్‌ ఇండియా 5వ ర్యాంక్‌ సాధించింది. కర్ణాటక రాష్ట్ర టాపర్‌గా నిలిచి అందరినీ అబ్బురపరిచింది. జేఈఈ మెయిన్ బీఆర్క్‌ పేపర్‌లో.. గణితంలో 99.54 పర్సంటైల్, ఆప్టిట్యూడ్ 99.92 పర్సంటైల్, డ్రాయింగ్ 77.13 పర్సంటైల్ చొప్పున సాధించింది. తన విజయానికి తాన కోచింగ్ సెంటర్ ఇచ్చిన ప్రిపరేషన్ చిట్కాలు కారణం అంటోంది రక్ష.

సెప్టెంబర్ నాటికి సిలబస్ పూర్తవడంతో రివిజన్ కోసం తగినంత సమయం లభించిందని తెల్పింది. కోచింగ్ సెంటర్ అందించిన స్టడీ మెటీరియల్స్‌తో పాటు, జేఈఈ మెయిన్ BArch పేపర్‌ ప్రిపరేషన్‌కు NCERT మెటీరియల్స్, మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా ప్రాక్టీస్ చేసినట్లు రక్షా చెబుతోంది. ముఖ్యంగా జనరల్ ఆప్టిట్యూడ్ కోసం వివిధ ఆన్‌లైన్ రీసోర్సెస్‌పై ఆధారపడ్డానని, డ్రాయింగ్/ప్లానింగ్ కోసం గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను అధ్యయనం చేసినట్లు రక్ష తన ప్రిపరేషన్‌ స్ట్రాటజీని వెల్లడించింది. ప్రేరణ కోసం Pinterestను విస్తృతంగా ఉపయోగించినట్లు పేర్కొంది.

పరీక్షకు కొద్ది రోజుల ముందు ప్రిపరేషన్ పూర్తిగా ఆపేసి.. ప్రతిరోజూ నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం, మాక్ టెస్ట్‌లను రాయడంపై దృష్టి పెట్టింది. ఇలాంటి కఠిన పోటీ పరీక్షలకు మాక్ టెస్ట్‌లు చాలా అవసరం. ఇవి బలహీనమైన స్పేస్‌లను గుర్తించడంలో, సమయ నిర్వహణను మెరుగుపరచడంలో, నిజ-సమయ పరీక్ష అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయి. ఇవి ప్రాక్టీస్ చేయకుండా, ప్రిపరేషన్‌ సాగిస్తే ప్రయోజనం ఉండదని చెబుతుంది. రక్షా గణితం, ఆప్టిట్యూడ్ కోసం దాదాపు 200 నుంచి 300 మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేసినట్లు రక్ష తెల్పింది. ఇది తన వ్యూహాన్ని మెరుగుపరచడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడిందని, జనరల్ ఆప్టిట్యూడ్, డ్రాయింగ్‌ను కూడా విస్తృతంగా అభ్యసించినట్లు ఆమె తెల్పింది.

ఇవి కూడా చదవండి

ఇక జనవరి 30న జరిగిన జేఈఈ మెయిన్ బీఆర్క్‌ పేపర్ క్లిష్టత స్థాయి గురించి రక్ష మాట్లాడుతూ.. మ్యాథమెటిక్స్‌ గతేడాది కంటే కఠినంగా ఉంది. జనరల్ ఆప్టిట్యూడ్ విభాగంలో సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఇది ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటుంది. డ్రాయింగ్ ప్రీవియస్‌ ఇయర్స్‌తో పోలిస్తే సవాలుగా, కాస్త సమయం తీసుకునేదిగా ఉందని రక్షా పేర్కొంది. ఆశావహ జేఈఈ మెయిన్‌ బీఆర్క్‌ అభ్యర్థులకు రక్ష సలహా ఏంటంటే.. ముందుగా అభిరుచిని గుర్తించాలి. ఆర్కిటెక్చర్ పట్ల మీకు ఎంత మక్కువ ఉందో అంచనా వేయాలి. మీ ఉత్సాహం తగినంత బలంగా ఉంటే, మీరు విజయం సాధించడానికి మార్గం సిద్ధమవుతుంది. పేపర్ 2లోని జనరల్ ఆప్టిట్యూడ్, డ్రాయింగ్ విభాగాలను తక్కువగా అంచనా వేయవద్దు. ఇందుకు తగినన్ని రీసోర్సులు ఆన్‌లైన్‌లో పొందవచ్చని సూచించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్‌కు తాత్కాలిక బ్రేక్.. ఎందుకో తెలుసా
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్.. నేషనల్‌ రేంజ్‌కి మన హీరోలు..
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
ఎండలో తిరుగుతున్నారా .. ఈ జాగ్రత్తలు తప్పని సరి వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
అంబానీ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా? వీడియో
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
కొబ్బరి కాయల వ్యాను బోల్తా.. అక్కడి స్థానికులు ఏం చేశారంటే? వీడియ
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారా? వీడియో
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
పహల్గామ్‌ ఉగ్రదాడిలో సంచలన విషయాలు.. చంపే ముందు ప్యాంటు విప్పి..
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
బిజినెస్ చేయాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 లక్షల లోన్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
అలాంటి కామెంట్స్ పెడతారా? చాలా బాధగా ఉందన్న శేఖర్ మాస్టర్
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ మరణం తర్వాత కొత్త పోప్ ఎవరు? వీడియో