Viral Video: అనూహ్య ఘటన.. రోడ్డుపై వెళ్తుండగా వినికిడి కోల్పోయిన ఆటో డ్రైవర్! ఏం జరిగిందంటే.. వీడియో
నేటి కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుంది. ప్రమాదం ఎటునుంచి పొంచి ఉందో.. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎవ్వరూ ఊహించలేక పోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై ఆటో డ్రైవింగ్ చేస్తుండగా.. అనూహ్య రీతిలో క్షణాల్లో వినికిడి శక్తి కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

ముంబై, ఫిబ్రవరి 24: రోడ్డుపై ఆటో నడుపుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ అనూహ్య రీతిలో వినికిడి కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న ట్రక్కు టైర్ ఒక్క సారిగా పెద్ద శబ్ధంతో పేలింది. దీంతో ఆటో డ్రైవర్ చెవి పట్టుకుని బాధతో విలవిలలాడాడు. తర్వాత గమనిస్తే అతడు వినికిడి శక్తి పూర్తిగా కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
ఈ వీడియోలో ఓ ఆటోరిక్షా డ్రైవర్ చెవి పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉండటం చూడొచ్చు. అతని చుట్టూ చాలా మంది వ్యక్తులు గుమికూడి ఉన్నారు. ఈ వీడియోలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కు టైరు పగిలిపోవడం, ఆ పక్కకనే ఉన్న ఆటో తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. వీడియోలో చెవి పట్టుకుని నిలబడిన వ్యక్తి ట్రక్కు టైరు పేలిపోవడం వల్ల ఆటో ధ్వంసమైందని చెప్పడం కనిపిస్తుంది. ఇంతలో మరొక వ్యక్తి మాట్లాడగా.. ఆటో డ్రైవర్ నువ్వు ఏం మాట్టాడుతున్నావో నాకు వినిపించడం లేదు అని చెప్పడం వినబడుతుంది.
ट्रक का टायर फटने से ऑटो रिक्शा के उड़े चीथड़े, ऑटो चालक के कान का पर्दा भी फट गया। अब उसे कुछ सुनाई नहीं दे रहा। pic.twitter.com/dLCGkjSu6K
— Abhimanyu Singh Journalist (@Abhimanyu1305) February 23, 2025
అయితే డ్రైవర్ శాశ్వతంగా తన వినికిడిని కోల్పోయాడా.. లేదా.. తాత్కాలికంగా వినికిడి కోల్పోయాడా అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఈ సంఘటన ముంబైలో జరిగినట్లు తెలుస్తున్నా.. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆటో డ్రైవర్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అదే రోడ్డుపై వెళ్తున్న మరో ట్రక్కు టైర్ హఠాత్తుగా పేలడం వల్ల ఈ దారుణం జరిగినట్లు తెలుస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.