Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టీచర్‌ మందలించాడనీ.. స్కూల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకిన 8వ తరగతి విద్యార్ధి!

విద్యార్ధుల జీవితంలో పాఠశాల స్థాయి ఎంతో కీలకమైంది. అక్కడ విద్యా బుద్ధులు నేర్పడమే కాదు.. సరైన సంస్కారం నేర్పి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమనేది కాదనలేని సత్యం. అలాంటిది.. ప్రస్తుతం రోజుల్లో విద్యార్ధులకు మంచీ.. చెడు.. చెప్పేందుకు టీచర్లు గజగజ వణికిపోతున్నారు..

Hyderabad: టీచర్‌ మందలించాడనీ.. స్కూల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకిన 8వ తరగతి విద్యార్ధి!
Student Jumps From School Building In Hyderabad
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 24, 2025 | 8:32 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఇటీవల కాలంలో పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవర్తన మరింత ఆందోళన కరంగా తయారవుతుంది. బడుల్లో విద్యా బుద్ధులు నేర్పడమే కాదు.. సరైన సంస్కారం నేర్పి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర అత్యంత కీలకమనేది కాదనలేని సత్యం. అలాంటిది.. ప్రస్తుతం రోజుల్లో విద్యార్ధులకు మంచీ.. చెడు.. చెప్పేందుకు టీచర్లు గజగజ వణికిపోతున్నారు. వారికి క్రమశిక్షణ ఏ విధంగా నేర్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. టీచర్లు కోపంగా చిన్న మాటన్నా, చేయెత్తి కొట్టినా.. విద్యార్ధులు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి సంఘటనే జరిగింది. ఓ స్కూల్లో టీచర్‌ 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని టీచర్‌ చెంపపై కొట్టడంతో.. అదే స్కూల్‌ భవనంపై నుంచి కిందకి దూకి విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం తీక్ర కలకలం సృష్టించింది. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని ద్వారకా నగర్‌కు చెందిన ధర్మారెడ్డి, సంగీత దంపతుల రెండవ కుమారుడు సంగారెడ్డి (14). ఉప్పల్‌లోని న్యూ భారత్ నగర్‌లోని సాగర్ గ్రామర్ స్కూల్‌లో సంగారెడ్డి 8వ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎంతో చురుకుగా ఉండే సంగారెడ్డిని శనివారం (ఫిబ్రవరి 22) ఓ విషయమై ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ క్లాస్‌లోని అందరి ముందు చెంపపై కొట్టాడు. దీంతో అవమానంగా భావించిన సంగారెడ్డి.. ఉపాధ్యాయుడి అనుమతి తీసుకుని టాయిలెట్‌కి వెళ్లాడు. అయితే సంగారెడ్డి నేరుగా స్కూల్ భవనం నాలుగో అంతస్తుకు చేరుకుని అక్కడి నుంచి కిందికి దూకేశాడు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని హుటాహుటీన సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు బాలుడిని పరీక్షించి, అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగాయి. సంగారెడ్డి మరణానికి పాఠశాల సిబ్బంది, యాజమాన్యమే కారణమని వారు ఆరోపించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని గ్రహించిన పాఠశాల యాజమాన్యం విద్యార్థులను ఇంటికి పంపించారు. ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిరసనకారులను శాంతింపజేసి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం పరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పీఈటీ టీచర్ బాలుడిని చెంపదెబ్బ కొట్టాడని కొంతమంది విద్యార్థులు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా తాను చనిపోతున్నానని తల్లిదండ్రులకు రాసిన సూసైడ్‌ నోట్‌ విద్యార్ధి నోట్‌బుక్‌లో లభ్యమైంది. దీంతో సదరు పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ సర్కిల్‌లో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ మాస్ హీరో
ఈ సర్కిల్‌లో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? టాలీవుడ్ మాస్ హీరో
వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
వీటి కూలింగ్ ముందు ఏసీలు పనిచేయవ్.. టెర్రకోటతో కొత్త టెక్నాలజీ
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఆర్థిక ఇబ్బందులు వల్ల అలాంటివి చేశా.. ఇప్పుడు చేయడం లేదు..
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
ఇకపై భారత్, పాక్ మ్యాచ్‌లుండవ్.. ఏ ఐసీసీ టోర్నమెంట్‌లోనూ ఆడేదిలే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
వేసవిలో తలనొప్పి రావడానికి మెయిన్ కారణం ఇదే
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
10th ఫలితాల్లో కాకినాడ బాలిక సత్తా.. 600కి 600 మార్కులు వచ్చాయ్!
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
ఉగ్రభయం..రైల్వే ట్రాక్ బోల్ట్‌లు తొలగించిన దుండగులు.ఏం జరిగిందంటే
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
భారత్ ప్రతిజ్ఞతో వణుకుతోన్న పాక్.. అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్, మసూద్
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
ఓటీటీలోకి సిద్దు జొన్నల గడ్డ లేటెస్ట్ మూవీ జాక్.?
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !
రానున్న పదేళ్లలో తులం బంగారం ధర ఇలా ఉంటుంది.. !