Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: చల్లని వెన్నెల్లో.. ఇసుక తెన్నెలపై.. గుడ్లు పెట్టేందుకొచ్చిన తాబేళ్ల దండు! తీరం నిండా లక్షల జీవాలు

యేటా నవంబరు నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. దీంతో చల్లని వెన్నెల రాత్రుళ్లో గుడ్లు పెట్టేందుకు ఇసుక తెన్నెల మీదకు లక్షలాదిగా తాబేళ్లు ఒడ్డుకు చేరుతుంటాయి. ఈ సారి కూడా దాదాపు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి..

Odisha: చల్లని వెన్నెల్లో.. ఇసుక తెన్నెలపై.. గుడ్లు పెట్టేందుకొచ్చిన తాబేళ్ల దండు! తీరం నిండా లక్షల జీవాలు
Turtles Nesting In Odisha
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 26, 2025 | 10:10 AM

ఒడిశా, ఫిబ్రవరి 26: ఒడిశాలోని గంజాం జిల్లా తీరప్రాంతంలో మరోసారి అంతరించి పోతున్న అరుదైన ఆలివ్ రిడ్లీ జాతికి చెందిన తాబేళ్లు సందడి చేశాయి. యేటా నవంబర్‌ నుంచి మార్చి మధ్యలో చల్లని వెన్నెల రాత్రుళ్లో గుడ్లు పెట్టేందుకు ఇసుక తెన్నెల మీదకు లక్షలాదిగా తాబేళ్లు ఒడ్డుకు చేరుతుంటాయి. ఈ సారి కూడా దాదాపు 6.82 లక్షలకు పైగా తాబేళ్లు సామూహికంగా గుడ్లు పెట్టేందుకు తరలివచ్చాయి. ఇది గత ఏడాది రికార్డును బ్రేక్‌ చేసింది. ఫిబ్రవరి 16న ఒడ్డుకు రావడం మొదలు పెట్టిన ఈ తాబేళ్లు ప్రతిరోజూ వేలాదిగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వస్తున్నాయి. బెర్హంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీ ఖోక్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 6.82 లక్షలకు పైగా తాబేళ్లు గూడ్లు కట్టాయి. 2023లో ఎనిమిది రోజుల్లో 6.37 లక్షల తాబేళ్లు గూడ్లు కట్టగా.. ఈ సారి ఆ సంఖ్య భారీగా పెరిగింది.

2022 లో దాదాపు 5.5 లక్షల తాబేళ్లు ఇక్కడ గూళ్ళు కట్టుకుని గుడ్లు పెట్టాయి. ప్రస్తుత గూడు కట్టే సీజన్ ఇంకా కొనసాగుతున్నందున, తుది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా బీచ్‌కు మరిన్ని తాబేళ్లు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త బివాస్ పాండవ్ మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో తాబేళ్లు సముద్రం నుంచి బయటకు రావడానికి స్థిరమైన వాతావరణ పరిస్థితులే ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సకాలంలో గూడు కట్టడం వల్ల విజయవంతంగా గుడ్లు పెట్టే అవకాశాలు పెరుగుతాయని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) శాస్త్రవేత్త బసుదేవ్ త్రిపాఠి తెలిపారు. 2021 – 2023 మధ్య ట్రాక్ చేయబడిన 330 కి పైగా GPS-ట్యాగ్ చేయబడిన తాబేళ్లు ఈ సంవత్సరం తిరిగి వచ్చాయని ZSI శాస్త్రవేత్త అనిల్ మోహపాత్ర అన్నారు. న్యూ పోడంపేట నుంచి ప్రయాగి వరకు దాదాపు 9 కి.మీ.ల విస్తీర్ణంలో తాబేళ్లు గూడు కడుతున్నాయి. వేటాడే జంతువుల నుంచి వీటి గుడ్లను రక్షించడానికి అటవీ శాఖ బీచ్ వెంబడి కంచెను ఏర్పాటు చేసింది. ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. వీటి పొదుగు కాలం సుమారు 45 రోజులు. అప్పటి వరకు గుడ్లను కాపాడటానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఖల్లికోట్ రేంజ్ ఆఫీసర్ దిబ్యా శంకర్ బెహెరా అన్నారు. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.