AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొంపముంచుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. నాలుగు వేల మంది ఉద్యోగాలు గోవిందా!

DBS ప్రతినిధి ఒకరు ఉద్యోగుల తగ్గింపు గురించి వివరాలను తెలియజేస్తూ, 'రాబోయే మూడు సంవత్సరాలలో, AI ప్రాజెక్ట్ ద్వారా 4,000 మంది తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులను తగ్గిస్తాము' అని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయే వారి కాంట్రాక్టులు కూడా రాబోయే కొన్ని సంవత్సరాలలో పూర్తవుతాయని తెలిపారు.

కొంపముంచుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. నాలుగు వేల మంది ఉద్యోగాలు గోవిందా!
Dbs Bank
Balaraju Goud
|

Updated on: Feb 26, 2025 | 10:05 AM

Share

ప్రపంచంలోని అగ్రశ్రేణి బ్యాంకులలో ఒకటైన DBS గ్రూప్, రాబోయే మూడేళ్లలో తన ఉద్యోగులను 10 శాతం, అంటే దాదాపు 4,000 మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వేగంగా అనుసంధానిస్తున్న సమయంలో DBS గ్రూప్ ఈ చర్య తీసుకుంది.

ప్రభావితమయ్యే ఉద్యోగులలో ప్రధానంగా తాత్కాలిక, కాంట్రాక్టు కార్మికులు ఉంటారని CEO పియూష్ గుప్తా తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి సుమారు వెయ్యి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. అయితే, ఎంత మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

‘రాబోయే మూడు సంవత్సరాలలో ఉద్యోగుల సంఖ్యను 4,000 లేదా 10 శాతం తగ్గించుకోబోతున్నామని అంచనా’ అని ఆయన అన్నారు. ఈ తగ్గింపుకు బ్యాంకింగ్ రంగంలో AI పెరుగుతున్న పాత్రను ఆయన గుర్తు చేశారు. కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్రత్యేక సాంకేతికత అని, దీని ద్వారా స్వీయ సృష్టి, ప్రతిరూప పనులు చేయవచ్చు అని ఆయన స్పష్టం చేశారు.

DBS ప్రతినిధి ఒకరు ఉద్యోగుల తగ్గింపు గురించి వివరాలను తెలియజేస్తూ, ‘రాబోయే మూడు సంవత్సరాలలో, AI ప్రాజెక్ట్ ద్వారా 4,000 మంది తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులను తగ్గిస్తాము’ అని అన్నారు. ఉద్యోగాలు కోల్పోయే వారి కాంట్రాక్టులు కూడా రాబోయే కొన్ని సంవత్సరాలలో పూర్తవుతాయని తెలిపారు.

ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద బ్యాంక్ DBSలో దాదాపు 41 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది కాకుండా, 8 నుండి 9 వేల మంది తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గత సంవత్సరం, CEO పియూష్ గుప్తా, DBS గత దశాబ్ద కాలంగా AI టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. మార్చిలో డిబిఎస్ గ్రూప్ సిఇఒ పదవి నుంచి పియూష్ గుప్తా వైదొలగనున్నారు. ఆయన స్థానంలో డిప్యూటీ సిఇఒ టాన్ సు షాన్ నియమితులవుతారు. AI టెక్నాలజీ పెరుగుతున్న ప్రభావం దాని ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి చర్చకు దారితీసింది. AI కారణంగా ప్రపంచంలో దాదాపు 40 శాతం ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశం ఉందని IMF హెచ్చరించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..