AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Credit Card: రైతులకు రూ.5 లక్షల వరకు ఈజీగా లోన్.. కీలక మైలురాయిని చేరిన కిసాన్ క్రెడిట్ కార్డ్

కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్ వరకు ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) ఖాతాల ద్వారా రూ.10.05 లక్షల కోట్ల రుణాలను రైతులకు అందించింది. ఇది 2014తో పోలిస్తే రెట్టింపు. ఈ పథకం వడ్డీ వ్యాపారులపై రైతులు ఆధారపడకుండా సహాయపడింది. పంట సాగు, పంటకోత ఖర్చులు, మార్కెటింగ్, గృహ అవసరాలకు ఈ రుణాలను ఉపయోగించవచ్చు. 7.72 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.

Kisan Credit Card: రైతులకు రూ.5 లక్షల వరకు ఈజీగా లోన్.. కీలక మైలురాయిని చేరిన కిసాన్ క్రెడిట్ కార్డ్
Pm Modi Kisan Credit Card
SN Pasha
|

Updated on: Feb 26, 2025 | 12:12 PM

Share

ఆపరేటివ్ కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) ఖాతాల కింద 2024 వరకు ఏకంగా రూ.10.05 లక్షల కోట్లు రుణాలు రైతులకు అందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడింది. మార్చి 2014లో ₹4.26 లక్షల కోట్ల నుంచి డిసెంబర్ 2024లో ₹10.05 లక్షల కోట్లకు రెట్టింపు అయిందని పేర్కొంది. వ్యవసాయ రంగంలో రుణ అవసంర పెరగడం, అలాగే వడ్డీ వ్యాపారుల నుంచి రైతులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవడం లాంటివి తగ్గడం ఈ కిసాన్‌ క్రిడిట్‌ కార్డులతో సాధ్యమైందని కూడా కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2024 డిసెంబర్‌ వరకు ఆపరేటివ్ KCCల కింద మొత్తం రూ.10.05 లక్షల కోట్లు రైతులకు ఇచ్చామని, దీంతో 7.72 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది. రైతులు చాలా సులువుగా రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. అయితే ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రైతులు రుణాలు, వ్యవసాయానికి ఉపయోగించే వస్తువులు, అలాగే ఎరువులు, పురుగు మందులు వంటివి కొనుగోలు చేసుకోవచ్చు. అధిక వడ్డీకి వడ్డీ వ్యాపారాల నుంచి రుణాలు తీసుకోకుండా ఈ కిసాన్‌ క్రిడిట్‌ కార్డులు రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఉపయోగాలు..

పంటల సాగుకు స్వల్పకాలిక రుణాల కోసం, పంటకోత తర్వాత ఖర్చులు, ఉత్పత్తి మార్కెటింగ్ రుణం, రైతు గృహ వినియోగ అవసరాలు, వ్యవసాయ ఆస్తులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల నిర్వహణకు వర్కింగ్ క్యాపిటల్, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు పెట్టుబడి కోసం ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మీకున్న లిమిట్‌ ప్రకారం డబ్బులు పొందవచ్చు.

ఈ కార్డులు ఎవరికి ఇస్తారంటే..

రైతులు – యాజమాన్య సాగుదారులకు ఈ కార్డులు మంజూరు చేస్తారు. అలాగే కౌలు రైతులు, నోటి కౌలుదారులు, వాటా పంటదారులు కూడా ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు పొందవచ్చు. కౌలు రైతులు, వాటా పంటదారులు మొదలైన రైతులతో కూడిన స్వయం సహాయక బృందాలు (SHGలు) లేదా ఉమ్మడి బాధ్యత బృందాలు (JLGలు)లకు కూడా ఉమ్మడి ఖాతా ద్వారా కిసాన్‌ క్రెడిట్‌ కార్డు జారీ చేస్తారు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఎలా పొందాలి?

మీరు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఎంపికల జాబితా నుండి, కిసాన్ క్రెడిట్ కార్డ్‌ను ఎంచుకోండి. అప్లై అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలతో ఫారమ్ నింపి సబ్మిట్‌ చేయాలి. అలా చేసిన తర్వాత, దరఖాస్తు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు అర్హులైతే, తదుపరి ప్రక్రియ కోసం బ్యాంక్ 3-4 పని దినాలలో మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలంటే నేరుగా దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి అసవరమైన పత్రాలు

  • దరఖాస్తు ఫారం
  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రాలు.
  • డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డ్ / ఓటరు గుర్తింపు కార్డు / పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు రుజువు.
  • డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ వంటి చిరునామా రుజువు.
  • రెవెన్యూ అధికారులచే సరిగ్గా ధృవీకరించబడిన భూమి యాజమాన్య రుజువు.
  • విస్తీర్ణంతో పంటల విధానం (పండించిన పంటలు).
  • వర్తించే విధంగా, రూ.1.60 లక్షలు / రూ.3.00 లక్షలకు పైగా రుణ పరిమితికి భద్రతా పత్రాలు.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!