గ్రీన్ కార్డు కావాలా మావ.. ట్రంప్ అద్దిరిపోయే ఆఫర్.. కానీ కండిషన్స్ అప్లై.!
వలసదారులు అమెరికన్ పౌరసత్వం పొందటానికి కొత్త పథకాన్ని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఈ గోల్డ్ కార్డ్ గ్రీన్ కార్డ్ ప్రీమియం వెర్షన్ అవుతుందని భావిస్తున్నారు. గోల్డ్ కార్డ్ పథకం ద్వారా సేకరించిన డబ్బును అమెరికా ఆర్థిక లోటును తగ్గించడానికి ఉపయోగిస్తామని ట్రంప్ అన్నారు. రెండు వారాల్లో ఈ పథకం అమలులోకి రానుంది.

అమెరికన్ గ్రీన్ కార్డ్.. లక్షల మందికి ఆకర్షించే మాట ఇది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నోట, గ్రీన్ కార్డ్ అనే మాట వచ్చింది. గ్రీన్ కార్డు ఇచ్చేస్తా అంటున్నారు ట్రంప్. అయితే, ఇది అందరికీ కాదు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే. కానీ మళ్లీ ఇక్కడో తిరకాసు. గ్రీన్ కార్డ్ కావాలంటే మరో కార్డు తీసుకోవాలని అంటున్నారు. ఆ కార్డు పేరే గోల్డ్ కార్డ్.
అమెరికాలో పెట్టుబడిదారుల కోసం ట్రంప్ కొత్త విధానం తీసుకొచ్చారు. 5 మిలియన్ డాలర్లు చెల్లిస్తే “గోల్డ్ కార్డ్” ఇస్తామంటున్నారు. 5 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు అన్నమాట. గోల్డ్ కార్డ్ కొంటే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, నివాసం కల్పిస్తామని ట్రంప్ భరోసా ఇస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేందుకు 1990లో EB-5 విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో “గోల్డ్ కార్డ్” విధానం తీసుకొస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. దీంతో 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 విధానం రద్దయినట్లే..! మరో రెండు వారాల్లో గోల్డ్ కార్డ్ అమల్లోకి వస్తుంది. గోల్డ్ కార్డ్ అంటే, గ్రీన్‌కార్డ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ అనీ, గోల్డ్ కార్డ్ కొటే గ్రీన్‌కార్డ్ కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉంటాయని ట్రంప్ ఊరిస్తున్నారు. ఇలా వచ్చిన నిధులతో దేశం అప్పులు తీరుస్తామని ట్రంప్ చెప్పుకుంటున్నారు.
ఇప్పటిదాకా అమెరికాలో పెట్టుబడిదారులకు ఆకర్షించడానికి EB-5 వీసా విధానాన్ని గతంలో తీసుకొచ్చారు. దీనికి ప్రకారం అమెరికాలో బిజినెస్ ప్రారంభించి, కనీసం 10 ఉద్యోగాలు ఇచ్చినవారు ఒక మిలియన్ డాలర్లు చెల్లిస్తే చాలు, వారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. EB-5 విధానంలో చాలా అవకతవకలు జరిగాయని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే కొత్త విధానం తీసుకొస్తున్నట్లు వివరించారు. ఇలా 10 లక్షల గోల్డ్ కార్డ్‌లు 5 మిలియన్ డాలర్ల చొప్పున విక్రయించినా, ఐదు ట్రిలియన్ డాలర్లు సంపాదిస్తానని ట్రంప్ అంటున్నారు.
అమెరికాలో పెట్టుబడులు పెట్టి, 43 కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఎవరికైనా గోల్డ్ కార్డ్ అంటున్నారు ట్రంప్. అయితే, రష్యన్లకు కూడా ఇలాంటి కార్డులు ఇస్తారా అని బరాబర్ ఇస్తాం ధీమాగా చెబుతున్నారు. అమెరికాలో ట్రంప్ వచ్చినా, ఆంక్షలు విధిస్తున్నా, గ్రీన్ కార్డ్‌కు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అమెరికాలో 2022 సెప్టెంబర్ నుంచి ఏడాది వరకు ఎనిమిది వేల మంది ఇన్వెస్టర్ వీసాలు తీసుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలు పెట్టుబడిదారులకు గోల్డ్ కార్డ్‌లు ఇస్తూ, వారికి పౌరసత్వం ఇస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




