Hyderabad: వామ్మో.. ప్రమాదం అంచున హైదరాబాద్.! ఈ మార్పులు గమనిస్తున్నారా?
ఆరోగ్యంగా జీవించాలంటే స్వచ్ఛమైన గాలి అవసరం. సిటీల్లో నూటికి నూరుపాళ్లు స్వచ్ఛమైన గాలి దొరకదన్న సంగతి తెలిసిందే. కానీ దేశ రాజధాని ఢిల్లీ మాదిరి గాలి నాణ్యత తీవ్ర స్థాయిలో పడిపోతే..! ఊహకే గుండె దడదడలాడుతుంది కదా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాలి నాణ్యత అలాగే ఉంది మరి. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 12 గంటల వరకు వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంది..

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేశ రాజధాని ఢిల్లీ పేరు వినబడగానే ముందుగా గుర్తుకొచ్చేది.. ఆ ప్రాంతాన్ని తీవ్రస్థాయిలో కబలించిన వాయు కాలుష్యం. మనుగడ కష్టసాధ్యంగా మారిన ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరిచేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే హైదరాబాద్ మహా నగరంలోనూ దాపురించింది. జంట నగరాల్లో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ఢిల్లీకి సమానంగా వాయు కాలుష్యం పెరిగింది. దీంతో ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నగరంలోని సనత్‌నగర్ ప్రాంతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలి టీ ఇండెక్స్‌లో సోమవారం నాడు ఏకంగా 431 ఏక్యూఐ నమోదైంది. ఈ మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మంగళవారం ఉదయం కాస్త ఓ మాదికిగా ఎన్నా సాయంత్రం నాటికి మళ్లీ 300పైకి ఏక్యూఐ చేరింది. ఇక బుధవారం కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం నగరంలో 259 ఏక్యూఐ ఉంది.
ఇలా క్రమంలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో పడిపోవడం ఏమంత మంచి పరిణామం కాదని పర్యావరన వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతం కావడంతో అక్కడ సాధారణంగానే అసాధారణ స్థాయిలో వాయు నాణ్యత క్షీణిస్తూ ఉంటుంది. సనత్‌నగర్‌లో గతేడాది నవంబర్ 25న 298, డిసెంబర్‌లో 229, గత జనవరిలో 171 ఏక్యూఐ నమోదైంది. అయితే గతంలో ఎన్నడూలేనంతగా సోమవారం రోజున ప్రమాదకర స్థాయిలో 450కి చేరువలో వ్యాల్యూస్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.
సాధరణంగా సున్నా నుంచి 50 వరకు ఏక్యూఐ ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు. 100 దాటిందంటే డేంటజర్ బెల్స్ మోగినట్లే. 400 నుంచి500 మధ్య ఉంటే తీవ్ర స్థాయిలో ప్రమాదం సూచన. అలాంటిది.. హైదరాబాద్‌లో 100కు తక్కువగా ఏ రోజూ గాలి నాణ్యత ఉండటం లేదు. ఇప్పుడు ఏకంగా 450కి చేరుకుంది. హైదరాబాద్‌లో ఇలా వాయు నాణ్యత పడిపోవడం గడచిన 6 నెలలుగా తరచూ జరుగుతుంది. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో వాయు నాణ్యత గరిష్టంగా క్షీణిస్తుంది. దీనిపై రేవంత్ సర్కార్ త్వరిత గతిన స్పందించి చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ మరో ఢిల్లీగా మారడం ఎన్నో రోజులు పట్టదు..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.