AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG EAPCET 2025 Application: నాన్‌లోకల్‌ సీట్లపై తేలని పేచీ.. ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణలో జాప్యం?

ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మంగళవారం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం నాడు రోజంతా లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఉదయం నుంచి యత్నించి విసిగెత్తిపోయారు. ఇందుకు కారణం..

TG EAPCET 2025 Application: నాన్‌లోకల్‌ సీట్లపై తేలని పేచీ.. ఈఏపీసెట్‌ దరఖాస్తుల స్వీకరణలో జాప్యం?
TG EAPCET 2025 Application
Srilakshmi C
|

Updated on: Feb 26, 2025 | 10:28 AM

Share

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంజినీరింగ్, ఫార్మా, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్‌ 2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ప్రారంభంకావాల్సిన టీజీ ఎప్‌సెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 1కి వాయిదా పడింది. దీంతో మంగళవారం నాడు రోజంతా లక్షలాది మంది విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఉదయం నుంచి యత్నించి విసిగెత్తిపోయారు. ఇందుకు కారణం.. ఈఏపీసెట్‌లో నాన్‌లోకల్‌ సీట్లపై ఎటూ తేల్చకపోవడమే. ఇందుకు సంబంధించిన పైల్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించకపోవడంతో దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్‌ పడింది.

పదేళ్ల క్రితం తీసుకొచ్చిన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. పదేళ్లపాటు అమలైన నాన్‌లోకల్‌ కోటా గడువు గత ఏడాదితో ముగిసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ అమలవుతున్న 70 శాతం ఇంజినీరింగ్‌ కన్వీనర్‌ కోటా, 30 శాతం బి కేటగిరీ (యాజమాన్యం) కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్‌ కోటాలోని సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి బ్రేక్‌ పడింది. దీనిపై అధ్యయనం చేయడానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాలకృష్టారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసులు విద్యాశాఖకు చేరగా, సంబంధించిన ఫైల్‌కు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు.

దీంతో మంగళవారం నుంచి ఈఏపీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ వాయిదాపడింది. నాన్‌ లోకల్‌ కోటాపై జీవో విడుదలైతే.. దాని ప్రకారం నిబంధనలు అమలవుతాయన్న కండీషన్‌ తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..